దేశంలో బెయిలుపై ఉన్న ఏకైక సీఎం వైఎస్ జగన్ కి రాత్రి నిద్రయినా పట్టిందో లేదో మరి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్రెడ్డి బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్పై సీబీఐ కోర్టు బుధవారం తీర్పు వెలువరించనుంది.
కేవలం సద్విమర్శలు చేస్తూ సరిదిద్దుకోమని పార్టీకి మేలు చేస్తున్న వారిని పనికిమాలిన కొందరు మూకలతో రెచ్చగొట్టించారు. ఆయన కాస్తరెచ్చిపోయిన వెంటనే పగబట్టి అరెస్టు చేశారు. చివరకు వైసీపీకి ఒక్కరోజు కూడా నిద్రపట్టకుండా చేస్తున్నారు రఘురామరాజు.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలుచేసిన ఈ బెయిలు రద్దు పిటిషన్పై అనేక విడతలుగా వాదనలు జరిగాయి. జూలై ఆఖరులో వాదనలు ముగిశాయి. తీర్పును అప్పటినుంచి కోర్టు రిజర్వు చేసింది. నేడు ఆ తీర్పు వెలువడనుంది.
ముఖ్యమంత్రిగా తనకు దక్కిన కొన్ని ప్రత్యేక అధికారాలతో జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని, కోర్టుకు ఎగ్గొడుతున్నారని రఘురామ ఏప్రిల్ మొదటి వారంలో పిటిషను వేశారు. బెయిల్ రద్దుచేసి ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని కోర్టును కోరారు.
అనంతరం కొంతకాలం తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై బుధవారం సీబీఐ కోర్టులో విచారణ కొనసాగనుంది. మరి బెయిలు రద్దు చేస్తారా? కొనసాగిస్తారా? అనే ఉత్కంఠ వైసీపీ శ్రేణుల్లో గట్టిగా ఉంది.