హీరో నాగ చైతన్యతో విడాకుల తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. గోవాలో వెకేషన్ లతో లైఫ్ ను ఎంజాయ్ చేసిన సామ్…ఆ తర్వాత హాట్ ఫొటో షూట్ లతో హాట్ టాపిక్ గా మారింది. ఊ అంటావా మావా అంటూ…ఐటమ్ సాంగ్ తో పాన్ ఇండియా రేంజ్ లో పేరు తెచ్చుకున్న సామ్…ఆ తర్వాత యాడ్స్ విషయంలోనూ దూకుడు పెంచింది. ఇటీవల ఓ మద్యం బ్రాండ్ యాడ్ లో నటించిన సమంత హాట్ లుక్స్ తో కట్టిపడేసింది. ఇక, తాజాగా క్రిటిక్స్ చాయిస్ ఫిల్మ్ అవార్డ్ దక్కించుకున్న సమంత….అక్కడకు వచ్చిన వారందరినీ తన అందంతో మంత్రముగ్దుల్ని చేసింది.
రెడ్ కార్పెట్ పై ఎమరాల్డ్ గ్రీన్, నలుపు రంగు డీప్ నెక్ డ్రెస్సులో తళుక్కున మెరిసిన సమంత అందం చూసేందుకు రెండు కళ్లు చాలలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా బోల్డ్ లుక్ లో సమంత ఫోజిచ్చిన ఫొటో ఇపుడు ఇంటర్నెట్ తో పాటు కుర్రాళ్ల గుండెల్లో తుఫాను రేపుతోంది. ఇక, ఆ ఫొటోను సామ్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. ‘నాకు అత్యంత ఇష్టమైన లుక్కిది’ అంటూ సమంత పెట్టిన పోస్ట్ పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఆ పోస్ట్ పై హీరో వెంకటేశ్ కుమార్తె దగ్గుబాటి ఆశ్రిత కూడా కామెంట్ చేసింది. ‘ముచ్చటేస్తోందంటూ..’ ఓ ఎమోజీని సామ్ ఫొటో కింద పోస్ట్ చేసింది.
చాలా అందంగా ఉన్నావంటూ రష్మిక మందన్న కామెంట్ చేయగా…’ఎందుకో అలా..’ అంటూ సంయుక్త హెగ్డే, ‘ఫైర్’ అంటూ రుహానీ శర్మ, హన్సికలు కామెంట్ చేశారు. తన సినిమాలన్నీ అభిమానులు మర్చిపోయారని, ఊ అంటావా పాటతోనే తెలుగు రాష్ట్రాలతోపాటు దేశమంతా తాను అభిమానులకు గుర్తుండిపోయానని సామ్ సంతోషం వ్యక్తం చేసింది. మరోవైపు, డీప్ నెక్ గౌన్ వేసుకున్న సమంతపై కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. గ్లామర్ ఓవర్ డోస్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.