టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్, యంగ్ హీరో రానాలు కలిసి నటిస్తున్న వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. భారీ బడ్జెట్తో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఈ మోస్ట్ అవెయిటెడ్ వెబ్ సిరీస్ త్వరలోనే స్ట్రీమ్ కాబోతోంది. దీంతో, ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లను మొదలుబెట్టారు వెంకీ మామ. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను వెంకీ విడుదల చేశారు.
‘నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నెట్ఫ్లిక్స్. రానా నాయుడు సిరీస్లో హీరో ఎవరు? నేను. అందరికంటే పెద్ద స్టార్ కూడా నేనే. అందంగా ఉంది కూడా నేనే. ఫ్యాన్స్ కూడా నాకు సంబంధించిన వాళ్లే. కాబట్టి ఈ సిరీస్కు రానా నాయుడు అని కాదు నాగా నాయుడు అనే పేరు ఉండాలి. నాతో మజాక్లు వద్దు.’ అని ఆ వీడియోలు వెంకటేష్ వార్నింగ్ ఇచ్చాడు. సరదాగా వెంకీ చేసిన ఈ కామెంట్ల వీడియో వైరల్ గా మారింది.
ఈ వెబ్ సిరీస్ లో వెంకీ మామ చాలా డిఫరెంట్ గా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో కనిపించబోతున్నారు. ఇక, బాబాయ్ వెంకీ, అబ్బాయ్ రానాల మధ్య అదిరిపోయే యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ లో రియల్ లైఫ్ బాబాయ్ అబ్బాయ్ లు రీల్ లైఫ్ తండ్రీకొడుకులుగా నటించారు. జైల్లో చేతులకి సంకెళ్లు వేసుకొని తెల్ల గడ్డంతో ఉన్న ఖైదీలా వెంకీ కనిపించారు. తండ్రిపై ద్వేషంతో రగిలిపోతున్న కొడుకుగా రానా కనిపించారు.
వెంకటేష్ తలకి రానా గన్ గురి పెట్టిన సీన్ ఇప్పటికే రిలీజైన్ టీజర్ కే హైలైట్. నేను మీ నాన్నని అని వెంకటేష్ అంటే నువ్వేమైనా మంచి పనులు చేశావా నాన్న అని పిలిపించుకోవడానికి అని రానా ఇచ్చిన కౌంటర్ అదిరిపోయింది. పాపులర్ అమెరికన్ సిరీస్ ‘రే డోనోవర్’ కు ఇండియన్ అడాప్షన్ వెర్షన్ గా ఈ వెబ్ సిరీస్ నిర్మించారు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ను హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా విడుదలచేయబోతున్నారు.