మొత్తానికి ‘దృశ్యం 2’ సినిమా విడుదలపై క్లారిటీ వచ్చింది. షూటింగ్ పూర్తై చాలా రోజులైనా ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని సస్పెన్స్ ఈ సినిమా విషయంలో నెలకొంది. ఓటీటీలో విడుదల కానుందంటూ చాలా రోజులుగా వార్తలు కూడా వస్తున్నాయి.
దానికి తోడు నిర్మాత సురేష్ బాబు కూడా తన సినిమాల విషయంలో ఇకపై ఓటీటీలకే ప్రాధాన్యతనిస్తానని చెప్పారు. దాంతో కన్ఫ్యూజన్ మరింత ఎక్కువయ్యింది. చివరికి అనుకున్నదే అయ్యింది. ‘దృశ్యం 2’ ఓటీటీ రిలీజ్‌కే ఫిక్సయ్యింది. ఈ నెల 25న అమెజాన్ ప్రైమ్‌లో ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్ని టీజర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు.
దృశ్యం ఏ రేంజ్లో విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. కథ, కథనాలకి తోడు వెంకటేష్ పర్ఫార్మెన్స్ ఆ సినిమాకి ప్రాణం పోసింది. అంత మంచి సినిమాకి సీక్వెల్ అనేసరికి అంచనాలు భారీగా ఉండటం సహజమే. అయితే సెకెండ్ పార్ట్ రెడీ అయ్యేసరికి పరిస్థితులు అనుకూలంగా లేవు. దాంతో విడుదల విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోడానికి లేకపోయింది. ఆ కారణంతోనే ఓటీటీ రిలీజ్‌కి ఫిక్సయి ఉండొచ్చు.
కానీ థియేటర్లు పూర్తిగా ఓపెన్ అయ్యాకయినా ఆ నిర్ణయం మార్చుకుని ఉండాల్సిందేమో. అనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. మార్చుకుని ఉంటారని కూడా అంతా అనుకున్నారు.
ఎందుకంటే ఇది ప్రేక్షకుల్ని బాగా ఎంగేజ్ చేసే కాన్సెప్ట్. మోహన్ లాల్ నటించిన ఒరిజినల్ ‘దృశ్యం 2’ చూశాక ఆ విషయం పూర్తిగా అర్థమయ్యింది. అయితే అక్కడ ఇప్పటి వరకు థియేటర్స్ విషయంలో క్లారిటీ రాక, ఇంకా వెయిట్ చేయడం ఎందుకని వాళ్లు ఓటీటీకి వెళ్లిపోయారు. మన దగ్గర ఆ పరిస్థితి లేదు.
థియేటర్లు తెరుచుకుని చాలా కాలమైంది. ఫుల్ ఆక్యుపెన్సీ ఉంది. పైగా ఈమధ్య వచ్చిన సినిమాలన్నీ వరుసగా డిజప్పాయింట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మంచి కథ, గ్రిప్సింగ్ స్క్రీన్‌ప్లే ఉన్న ఇలాంటి చిత్రం ఒకటి పడితే ప్రేక్షకులు వదులుకోరు. ఆ అవకాశాన్ని టీమ్ ఎందుకు వాడుకోవడం లేదు అనే ప్రశ్నకి జవాబు వెతుకుతున్నారు జనాలు.
Drushyam2 on Nov 25 Amazon Prime