ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణకు సతీవియోగం కలిగింది. ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ వేమూరి కనకదుర్గ (63) కన్నుమూశారు.
కొన్ని వారాలుగా వేమూరి కనకదుర్గ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో తాజాగా కన్నుమూశారు.
ఈరోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
వేమూరి కనకదుర్గ (మృతి)కి పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం తెలిపారు. ఏబీఎన్ ఎండి వేమూరి రాధాకృష్ణ సతీమణి వేమూరి కనకదుర్గ అనారోగ్యంతో చనిపోవడం బాధాకరమని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తంచేశారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనో ధైర్యం ఇవ్వాలని దేవున్ని ప్రార్ధిస్తున్నానని చంద్రబాబు నాయుడు అన్నారు.
వేమూరి కనకదుర్గ మృతిపట్ల ఎంపీ రఘురామకృష్ణంరాజు సంతాపం వ్యక్తంచేశారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ గారి సతీమణి శ్రీమతి కనక దుర్గ గారి హఠాన్మరణం బాధించింది. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. రాధాకృష్ణ గారికి వారి కుటుంసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.#ABNRadhaKrishna @abntelugutv
— Dr. N Raghuveera Reddy (@drnraghuveera) April 27, 2021