ఈ ప్రశ్నకు సమాధానం ఉందా? ఇది కరెక్టు ప్రశ్నేనా అనుకుంటున్నారా? ఉంది. సరైన భోజనం ఆస్పత్రులకు వెళ్లకుండా కాపాడుతుంది. అసంబద్ధ ఆహారం, అసందర్భంగా తీసుకుంటే మీరు ఎన్ని ఆస్పత్రులకు వెళ్లినా ఉపయోగం శూన్యం. అందుకే వీలైనంత వరకు భోజనం ద్వారానే మన శరీరాన్ని కాపాడుకోవాలి. అందుకు ఉపయోగపడే కొన్ని మంచి విషయాలను ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు.
ఇపుడు మందులు వేయకుండా ఏ పంట పండని దుస్థితి. కాబట్టి మీరు కడగకుండా ఏదీ వండకూడదు. కూరగాయలు అయినా, ఇంకేదైనా శుభ్రంగా కడగడం వల్ల చాలా వరకు కెమికల్స్ నుంచి మన కూరగాయలను వేరుచేయొచ్చు.
ఇక ఎలాంటివి మనల్ని క్యాన్సర్ కి దూరంగా ఉంచుతాయో తెలుసుకుందాం.
వెల్లుల్లి – క్యాన్సర్ తో పాటు గుండె పోటు నుంచి, డయాబెటిస్ నుంచి కాపాడుతుంది.
పాలకూర – క్యాన్సర్ ను నివారించడంతో పాటు క్యాల్షియం ఇచ్చి ఎముకలను బాగా కాపాడుతుంది
బ్రోకలీ (బ్రకోలి) – ఇందులోని గ్లూకోసినోలేట్ మరియు సల్ఫోరాఫేన్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.
పచ్చిబఠానీ – బఠానీ క్యాన్సర్ రాకుండా చూడటమే కాకుండా వచ్చిన వారిలో కణాల పెరుగుదలను తగ్గిస్తుంది. కొందరిలో క్యాన్సర్ కణాలను చంపుతుంది
చిలగడదుంప – ఇది రొమ్ము క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది
మనం ఎన్నో చెత్త వార్తలు చదువుతు, షేర్ చేస్తుంటాం. ఈ ఉపయోగపడే లైఫ్ సేవింగ్ వార్తను అందరితో పంచుకుని వారి జీవితాలను కాపాడండి. ముఖ్యంగా మీ భార్యతో, మీ పిల్లలతో, మీ తోబుట్టువులతో పంచుకోండి ఈ వార్తను. సుఖీభవ.