సీఎం jagan తో వివాదాస్పద సినీ దర్శకుడు Ramgopal Varma రామ్ గోపాల్ వర్మ ఇటీవల భేటీ అయిన సంగతి తెలిసిందే. jagan తో లంచ్ చేసిన వర్మ…ఆ తర్వాత మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. మామూలుగా మీడియా అంటే భయపడని varma…అలా సైలెంట్ గా వెళ్లడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే తాజాగా వర్మ తాను రెండు పొలిటికల్ థ్రిల్లర్ మూవీస్ తీయబోతున్నానని జగన్ ను కలిసిన మరుసటి రోజు ప్రకటించడం సంచలనం రేపుతోంది.
అతి త్వరలో తాను 2 భాగాలుగా ఓ పొలిటికల్ మూవీని తీయబోతున్నానని వర్మ ప్రకటించారు.
రాజకీయ అరాచకీయాలు పుష్కలంగా ఉండేలా ఆ సినిమాలు తీయబోతున్నానని అన్నారు.
ఇది బయోపిక్ కాదని, బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్ అని అన్నారు.
బయోపిక్ లో అబద్ధాలుంటాయేమోనని, కానీ, రియల్ పిక్ లో నూటికి నూరుపాళ్లు నిజాలే ఉంటాయని అన్నారు.
అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుంచి ఉద్భవించినదే ‘వ్యూహం’ కథ అని వర్మ వివరించారు.
ఇది రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుందని, రాచకురుపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహాన్ని ప్రతిబింబించేలా ‘వ్యూహం’ చిత్రం తెరకెక్కిస్తానని చెప్పారు. ‘
వ్యూహం’ షాక్ నుంచి తేరుకునేలోపే… పార్ట్-2 ‘శపథం’లో మరో ఎలక్ట్రిక్ షాక్ electric Shock తగులుతుందని చెప్పారు.
తనతో ‘వంగవీటి’ చిత్రాన్ని నిర్మించిన దాసరి కిరణ్ ఈ చిత్రానికి నిర్మాత అని వెల్లడించారు.
దీంతో, వర్మ ఎవరిపై పొలిటికల్ సెటైర్ వేయబోతున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది.