• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అతడి వల్లే లైగర్ ప్లాప్ అంటోన్న వర్మ

admin by admin
September 14, 2022
in Movies, Top Stories
0
0
SHARES
170
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, విలక్షణ దర్శకుడు పూరీ జగన్నాథ్ ల కాంబోలో వచ్చిన లైగర్ భారీ ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బొక్క బోర్లా పడింది. పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండల కెరీర్ లో కూడా ఈ సినిమా అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే, ఈ సినిమా ఫ్లాప్ కావడానికి కథా, కథనంలో బలం లేకపోవడమే కారణమని సినీ విమర్శకులు కొందరు, ఇండస్ట్రీకి చెందినవారు విమర్శించారు.

అయితే, సినిమా హిట్ కాకపోవడానికి విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ కూడా కారణమని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో పాటు మరికొందరు విమర్శించారు. ఈ క్రమంలోనే తాజాగా లైగర్ ఫ్లాప్ కావడానికి కారణాలను వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో విశ్లేషించారు. ఈ సినిమా ఆడకపోవడానికి విజయ్ దేవరకొండే కారణమని వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. మామూలుగానే విజయ్ దేవరకొండ దూకుడు స్వభావి అని, స్టేజి మీదకి ఎక్కిన తర్వాత అందరి ఫోకస్ తనపై ఉండాలి అని కోరుకునే వ్యక్తి అని విమర్శించారు.

వేదికపై ఎక్కిన తర్వాత ప్రేక్షకులను ఆకర్షించేందుకు తనదైన శైలిలో పొగరుగా మాట్లాడడం, సైగలు చేయడం విజయ్ కు అలవాటేనని అన్నారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లు తమ వినయం, విధేయత, నడవడికతో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారని వర్మ కితాబిచ్చాడు. అప్పటిదాకా బాలీవుడ్ తారల అహంకారాన్ని మాత్రమే చూసిన హిందీ ప్రేక్షకులు…దక్షిణాది నటుల వినయపూర్వక, మర్యాదపూర్వక ప్రవర్తనను చూసి అద్భుతంగా ఉందని భావించారని చెప్పారు.

అటువంటి సమయంలో లైగర్ ప్రమోషన్ ఈవెంట్లలో విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్, లాంగ్వేజ్ చూసి షాక్ అయ్యారని చెప్పుకొచ్చారు. తన స్వాభావికమైన పొగరుతో విజయ్ దేవరకొండ ఇచ్చిన స్పీచ్ లు బాలీవుడ్ ప్రేక్షకులకు రుచించలేదని, అందుకే లైగర్ ను డిజాస్టర్ చేశారని వర్మ అన్నాడు.

Tags: actor vijay devarakondadirector varmaLiger flopliger movievarma's comments
Previous Post

పాదయాత్రకు పోలీసుల బ్రేక్..హై టెన్షన్

Next Post

దాన్ని బ్రోతల్ హౌస్ లా మార్చారు..అయ్యన్న ఫైర్

Related Posts

Top Stories

కోటంరెడ్డిపై పేర్ని నాని షాకింగ్ కామెంట్స్

February 1, 2023
Andhra

జగన్ భూ బకాసురుడు…లోకేష్ ఫైర్

February 1, 2023
Movies

మెగా రికార్డుపై పఠాన్ కన్ను

February 1, 2023
Trending

కోటంరెడ్డి ఇష్యూపై బాలినేని సంచలన వ్యాఖ్యలు

February 1, 2023
jagan
Top Stories

నెల్లూరు వైసీపీలో క‌ల‌క‌లం.. బ‌ల‌మైన నేత‌లు దూరం?

February 1, 2023
Top Stories

ఆనం వారి సంక‌టం.. ఓ రేంజ్‌లో..!

February 1, 2023
Load More
Next Post

దాన్ని బ్రోతల్ హౌస్ లా మార్చారు..అయ్యన్న ఫైర్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • కోటంరెడ్డిపై పేర్ని నాని షాకింగ్ కామెంట్స్
  • జగన్ భూ బకాసురుడు…లోకేష్ ఫైర్
  • మెగా రికార్డుపై పఠాన్ కన్ను
  • కోటంరెడ్డి ఇష్యూపై బాలినేని సంచలన వ్యాఖ్యలు
  • నెల్లూరు వైసీపీలో క‌ల‌క‌లం.. బ‌ల‌మైన నేత‌లు దూరం?
  • ఆనం వారి సంక‌టం.. ఓ రేంజ్‌లో..!
  • Budget 2023 : మోడీ ఆశ బారెడు
  • Budget 2023 : మోడీ `ఏడు గుర్రాల స్వారీ`.. బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లు ఇవే!
  • అస్కార్ చిత్రాల్ని వెనక్కి నెట్టి మరీ ‘ఆర్ఆర్ఆర్’ ఆ అవార్డు
  • స‌మంత సినిమా మ‌ళ్లీ వాయిదా?
  • జగన్ చేస్తోంది మోసం కదా?
  • జగన్ లా దొంగ హామీలివ్వను: లోకేష్
  • నా ఫోన్ ట్యాప్..ప్రాణహాని ఉంది: ఆనం రామనారాయణ రెడ్డి
  • బిగ్ బ్రేకింగ్: టీడీపీలోకి కోటంరెడ్డి..ఆడియో లీక్?
  • బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

Most Read

ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్

బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

ఇది.. వైసీపీ కోరి పెట్టుకుంటున్న కుంప‌టి!!

అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra