అందానికి అందం.. అభినయం వచ్చిన నటీమణులు కొందరు ఉంటారు. అలాంటి వారిని చూసినంతనే.. భవిష్యత్తులో సినిమా రంగాన్ని ఏలేస్తారని అనుకుంటారు. కానీ.. సిత్రంగా వారి కెరీర్ దారుణాతి దారుణంగా ఉండే పరిస్థితి. ఎందుకిలా? అంటే.. కెరీర్ మీద ఫోకస్ పెట్టాల్సిన వేళ.. ప్రేమలు.. రిలేషన్ షిప్పులు.. సహజీవనాలు అంటూ తీసుకునే నిర్ణయాలతో దెబ్బ పడే పరిస్థితి. అలాంటి వాటికి ఎందురో నటీమణులు తమ కెరీర్ ను దెబ్బేసుకున్నారు. ఆ కోవలోకే వస్తుంది కోలీవుడ్ నటి వాణి భోజన్.
చూసినంతనే కళ్లు తిప్పుకోలేని అందం.. దానికి మించిన ఆకర్షణ. అలాంటి ఆమెకు హీరోయిన్ గా రాణిస్తుందన్న అంచనా ఉండేది. కానీ.. అవకాశాల కంటే కూడా వివాదాల చుట్టూ ఆమె పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఈ కారణంతోనే కావొచ్చు.. సరైన ఛాన్సులు రాని పరిస్థితి. కెరీర్ సక్రమంగా లేని వేళ.. అమ్మడు తమిళ నటుడు ‘జై’తో రిలేషన్ షిప్పు మొదలుపెట్టటం.. ఇద్దరు సహజీవనానికి తెర తీయటం జరిగిపోయాయి.
సహజీవనంలో తన బాధ్యత తాళాల్ని ‘జై’ చేతిలో పెట్టేయటంతో.. ఆమెకు అవకాశాలు ఇచ్చేందుకు వచ్చే దర్శక నిర్మాతల్ని ఇంటి గుమ్మం వరకు కాదు కదా.. దరిదాపుల్లోకి రానిచ్చేవాడు కాదట. దీంతో.. ఆమెకు సంబంధించిన ఏ విషయాన్ని అయినా జైతోనే సంప్రదించాల్సిన పరిస్థితి. ఇలా అవకాశాలు చేజారిపోవటమే కాదు.. ఆమె దగ్గరకు వచ్చే వారు తగ్గిపోయారు. వరుస పెట్టి అవకాశాలు పోతున్న వేళ.. కళ్లు తెరిచిన ఈ బ్యూటీ తాజాగా జైకు బ్రేకప్ చెప్పేసినట్లుగా తెలుస్తోంది. గతంలోనూ జైతో రిలేషన్ లో ఉన్న అంజలి పరిస్థితి కూడా ఇలానే ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.