భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ అనే వ్యక్తి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోన్న సంగతి తెలిసిందే. తన చావుకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు కుమారుడు వనమా రాఘవ కారణమంటూ రామకృష్ణ సూసైడ్ సెల్ఫీ వీడియో వైరల్ అయింది. దీంతో, రాఘవను అరెస్టు చేయాలంటూ విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆ ఘటనపై వనమా వెంకటేశ్వరరావు స్పందించారు. కొడుకు నిర్వాకంపై వనమా వెంకటేశ్వరరావు బహిరంగ లేఖ విడుదల చేశారు.
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని వనమా అన్నారు. ఈ ఘటనలో తన కుమారుడిపై ఆరోపణలు రావడం కలిచివేసిందని, కానీ, పోలీసులు ఎప్పుడు పిలిచినా తన కొడుకుని అప్పగిస్తానని షాకింగ్ కామెంట్లు చేశారు. రాఘవ విషయంలో విచారణ నిష్పక్షపాతంగా జరగాలని కోరుకుంటున్నానని అన్నారు.