భువనేశ్వరిపై వైసీపీ నేతలు చేసిన దిగజారుడు వ్యాఖ్యలు ఎంతోమందిని కలతకు గురిచేశాయి. ఒక మహిళను మీడియా ముఖంగా తీవ్ర అవమానాలు పాలు చేసే వల్లభనేని వంశీ ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం, దూషణ ఎదుర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ వంశీని ఏకగ్రీవంగా తప్పుపట్టారు. దీంతో తనను ప్రజలు అసహ్యించుకుంటారని అర్థం చేసుకున్న వల్లభనేని వంశీ తాజాగా తన తప్పును ఒప్పుకున్నారు. చంద్రబాబు కుటుంబానికి క్షమాపణలు చెప్పారు.
వంశీ మాటల్లో…
నేను భువనేశ్వరిపై పొరపాటున వ్యాఖ్యలు చేశాను. చంద్రబాబు సతీమణికి క్షమాపణ చెబుతున్నాను. ఎమోషన్ లో ఒక పదం తప్పుగా దొర్లినమాట వాస్తవం. నా వ్యాఖ్యలకు నేను బాధపడుతున్నాను. టీడీపీలో నాకు అందరికంటే ఆత్మీయురాలు భువనేశ్వరి. భువనేశ్వరిని నేను అక్కా అని పిలుస్తాను. కులం నుంచి వెలివేస్తారనే భయంతో క్షమాపణ చెప్పలేదు.. నేను మనస్ఫూర్తిగానే క్షమాపణ చెబుతున్నా. చంద్రబాబును కూడా క్షమాపణ కోరుతున్నా
వల్లభనేని వంశీ తెలుగుదేశంలోనే రాజకీయంగా పుట్టి పెరిగారు. చివరకు అవన్నీ మరిచిపోయి ఎవరో ఆడిస్తే ఆడిన మనిషిలా తాను ఒక ఆడపిల్లకు తండ్రిని, మరో ఆడపిల్లకు భర్తను, మరో మహిళకు కొడుకును అనే విషయం మరిచి జంతువులా వ్యవహరించారు. ఇన్నాళ్లకు అయినా జ్జానోదయం అవడం సంతోషం.