అది 1997వ సంవత్సరం నవంబర్ 19వ తేదీ ఉదయం పరిటాల రవి తన తండ్రి జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించడానికి ముహూర్తం షాట్ గా రామానాయుడు స్టూడియో వేదికగా చలన చిత్ర నిర్మాతలు వేలాది అభిమానులు మరియు పాత్రికేయులు సమక్షంలో అంగరంగ వైభవంగా ముహూర్తపు షాట్ చిత్రీకరించారు . అనంతరం పరిటాల రవీంద్ర, టాటా సుమో వాహనంలో మోహన్ బాబును కూర్చోబెట్టుకుని తానే స్వయంగా వాహనం నడుపుతూ బయటకు వచ్చే సమయంలో , ఒక్కసారిగా జూబ్లీహిల్స్ దద్దరిల్లేలా భయంకరమైన శబ్దం ! రెప్పపాటులో చెల్లాచెదురుగా పడి ఉన్న అవయవాలు !క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఎటుచూసిన మాంసపు ముద్దలు రక్తపుటేరులు పరిటాల రవీంద్రను అంతమొందించడానికి ప్రత్యర్థులు ప్రయోగించిన రిమోట్ bomb ప్రయోగం.
మరి ఆ బాంబు దాడిలో పరిటాల రవీంద్ర ఎలా తప్పించుకున్నాడు ? ఈటివి చెందిన ఆరుగురు టీవీ జర్నలిస్టు వాహనం పరిటాల రవి కారు నడుపుతున్న దృశ్యాలను చిత్రీకరించాలి అని ఉద్దేశంతో ఒక్కసారిగా మెరుపువేగంతో రవీంద్ర వాహనాన్ని ఓవర్టేక్ చేసిన సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం ! భూమిలోపల ఆరు అడుగుల వెడల్పు మరియు రెండు అడుగుల లోతులో అమర్చిన కార్ రిమోట్ సాయంతో సుమారు 20 అడుగుల ఎత్తుకు ఎగిరి పడ్డా ఈటీవీ వాహనం ! ఆ వాహనంలో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మిక్కిలినేని జగదీష్ తో సహా మరో ఐదుగురు జర్నలిస్టులు క్షణాల్లో మాంసపు ముద్దలుగా మిగిలారు ఈ దుర్ఘటనలో మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారు ! 31 మంది వివిధ అవయవాలు కోల్పోయి మిగిలారు !
అదృష్టవశాత్తు పరిటాల రవీంద్ర, సినీనటుడు మోహన్ బాబు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందారు. ఆ సమయంలో నటుడు మోహన్ బాబు పత్రికా విలేకరులతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తనను చంపటానికి కుట్ర పన్నాడు అని చెప్పటంతో కామినేని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పరిటాల రవి అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నటుడు మోహన్ బాబు కు స్వయంగా ఫోన్ చేసి ఈ సంఘటనను తప్పుదోవ పట్టించే విధంగా ఒక మాట మాట్లాడినా నీ నాలుక కోస్తా అని బెదిరించడం జరిగింది .
పోలీసులు విచారణలో జూబ్లీ హిల్స్ కారుబాంబు గ్యాంగ్‌స్టర్ గంగుల సూర్యనారాయణరెడ్డి అలియాస్ మద్దెల చెరువు సూరి అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు ! ఐదు సంవత్సరాల సుదీర్ఘ పోలీసు విచారణలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగస్టు 25 , 2002 సంవత్సరంలో ఈ కేసులో సంబంధం ఉన్న ప్రధాన నిందితుడు మద్దెల చెరువు సూరి గా పిలవబడే గంగుల సూర్యనారాయణరెడ్డి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, జి వాసుదేవరెడ్డి ,ఆనంద రెడ్డి ,లక్ష్మారెడ్డి లకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు ! వీరితో పాటు మరో ముఖ్యమైన ఒక కంప్యూటర్ ఇంజనీర్ సాంకేతిక సహాయకుడిగా పనిచేసిన పవన్ కుమార్ రెడ్డి కి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది.
పవన్ కుమార్ రెడ్డికి వల్లభనేని వంశీ కి ఉన్న లింకేమిటి ?? జూబ్లీ హిల్స్ కారుబాంబు కేసులో మద్దెలచెర్వు సూరి తో పాటు సహ నిందితుడు సాంకేతిక సహాయకుడిగా పనిచేసి రిమోట్‌తో బాంబును పేల్చడానికి కారణమైన పవన్ కుమార్ రెడ్డి తిరుపతి లో వల్లభనేని వంశీ చదువుకునే సమయంలో పవన్ కుమార్ రెడ్డి సహ విద్యార్థి ఒకే హాస్టల్ ; బాంబు దాడి జరిగిన తరువాత పోలీసు వారి విచారణలో నిందితులు ఎవరు ఈ పవన్ కుమార్ రెడ్డిని గుర్తుపట్టి వివరాలు చెప్పగల వ్యక్తి ఎవరు అని అప్పట్లో ఏపీ పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న ఒక అధికారి రహస్యంగా పవన్ కుమార్ రెడ్డితో పాటు చదువుకున్న లేదా హాస్టల్లో ఉంటున్న వారి వివరాలు పరిశీలిస్తే రాయలసీమ ప్రాంతంతో సంబంధం లేని కోస్తా ప్రాంతం కృష్ణా జిల్లాకు చెందిన వల్లభనేని వంశీ పేరు ఆ పోలీసు అధికారి పరిశీలనలోకి వచ్చింది ! ఆ పరిశీలన వల్లభనేని వంశీ ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ప్రజల ముందుకు తీసుకురాగలిగింది !
వివరాల్లోకి వెళితే ఆ పోలీసు అధికారి వల్లభనేని వంశీని రహస్యంగా ఒక ప్రాంతానికి పిలిపించి ఈ వ్యక్తి ఎవరు ? అతని పూర్తి వివరాలు మాకు కావాలి అతను కారుబాంబు కేసు నిందితుడు అని మాకు పవన్ రెడ్డి విషయంలో పూర్తి వివరాలు తెలియాలి అని ; అలా పోలీసు అధికారితో పలుమార్లు వంశీ సమావేశం అవ్వడం పవన్ రెడ్డి ఊరు వివరాలు మొదలగు విషయాలు అధికారికి తెలియజేశాడు ఆ సమయంలో వల్లభనేని వంశీ ఇంటెలిజెన్స్ అధికారిని ఒకసారి పరిటాల రవి గారిని చూడాలి అనుకుంటున్నాను ; కనీసం దూరం నుండి అయినా పర్వాలేదు అని అంటే ! సమయం వచ్చినప్పుడు నేను నిన్ను తీసుకు వెళతాను అప్పటివరకు చదువు పట్ల శ్రద్ధ పెట్టి చదువుకో అని ఆ అధికారి సలహా ఇచ్చాడు.
ఆ తరువాత కొంత కాలానికి ఆ పోలీస్ అధికారి నుండి పిలుపు వచ్చింది నీవు పరిటాల రవీంద్రను చూడాలి అన్న నీ కోరిక తీరబోతుంది . మరుసటి రోజు ఉదయం పోలీసు అధికారితో పాటు వంశీ పరిటాల స్వగృహం అనంతపురం నివాసంలో పరిటాల రవీంద్ర దర్శనం కలిగింది ఆ అధికారి పరిచయం చేస్తూ ఇతని పేరు వల్లభనేని వంశీ కృష్ణా జిల్లా ఇతనే బాంబు కేసు నిందితుడు పవన్ రెడ్డి గుర్తుపట్టి అతని వివరాలు మాకు తెలియజేయడంలో సహాయపడ్డాడు అని తెలియజేశాడు ! అప్పుడు రవి వంశీ తో మీ తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు ?ఎంత కాలం నుండి నీవు తిరుపతిలో ఉంటున్నావు ? భోజనం చేసి వెళ్ళు అనే మాటలతో రవి సంభాషణ ముగిసింది!
ఆ తర్వాత వంశీ తిరుపతి కి తిరుగు ప్రయాణం జరిగింది ఆ తరువాత కొంతకాలానికి మళ్లీ అదే పోలీస్ అధికారి నుండి వంశీకి పిలుపువచ్చింది, విషయం చాలా రహస్యం బయటకు వస్తే ప్రాణానికే ప్రమాదం నేను నీకు ఒక పని చెప్తాను అది నీవు చేయగలవా ? అని అడిగాడు వంశీని ; అప్పుడు ఆ అధికారి చర్లపల్లి జైల్లో ఉన్న నీ మిత్రుడు పవన్ రెడ్డి ఉన్నాడు అతనికి నీవు రేపు భోజనం పార్సల్ తీసుకు వెళ్ళాలి, అని చెప్పగా అలాగే సార్ దానిదేముంది అని చెప్పగా అది మామూలు భోజనం కాదు అది విషం కలిపిన భోజనం అని చెప్పగా దానికి వంశీ నాకు ఏపీ ప్రమాదం జరగదు కదా ? అని భయపడుతున్న నీకు ఏ ప్రమాదం జరగదు. ఈ విషయంలో నీవు ధైర్యంగా ఉండు నేను నీకు తోడుగా ఉన్నాను అని ధైర్యం చెప్పాడు ఆ అధికారి.
ఆ మరుసటి రోజు మధ్యాహ్నం భోజనం ప్యాకెట్ పట్టుకొని చర్లపల్లి జైలు రిజిస్టర్లో పవన్ రెడ్డిని కలవడానికి రిజిస్టర్లో సంతకం పెట్టి లోపలికి అడుగుపెట్టాడు ; సందర్శకుల హాలులో ఇనప రాడ్ గ్రిల్ అవతలివైపు పవన్ రెడ్డి ఎవరితోనూ మాట్లాడుతున్నట్టు కనిపించాడు !వంశీ ఆ ప్యాకెట్ తీసుకుని నేరుగా పవన్ రెడ్డి వద్దకు వెళ్ళాడు ఎలా ఉన్నావ్ అని వంశీ పలకరించగా తల క్రిందకు పైకి మాటలతో చెప్పలేని బాధను కళ్ళల్లో చూపిస్తూ పెదవులపై చిరునవ్వుతో పలకరించాడు.
ఇదిగో ఇది నీకోసమే తీసుకో అని ఒక చేతిలో ఉన్న ఆపిల్ ప్యాకెట్ మరో చేతిలో ఉన్న భోజనాన్ని పవన్ కు అందించబోగా ఎందుకు వద్దు అని పవన్ తిరస్కరించగా ;నిన్ను చూడాలని తిరుపతి నుంచి వచ్చాను తీసుకో అని అడుగగా పవన్ కు వాటిని అందించాడు వంశీ ఆ వెనువెంటనే వెనుదిరిగిన వంశీ నేరుగా వంశీ స్వగ్రామం కృష్ణా జిల్లా గన్నవరం మండలం ఆముదాలపల్లి కి పయనం . ఒక పది రోజుల తర్వాత వంశీ తన సొంత ఊరు నుంచి తిరుపతికి నేరుగా పోలీస్ అధికారి ని కలవగా వంశీ నీకు జరిగిన విషయం తెలుసా ? అని అడగ్గా తెలుసు సార్ నాకు చాలా భయంగా ఉంది ;నిద్ర పట్టడం లేదు నాకు ఒక సహాయం చేయండి నన్ను నన్ను రవి గారికి దగ్గరకు తీసుకు వెళ్ళండి నేను అక్కడి వారిలో ఒకటిగా ఉండి పోతాను అని ప్రాధేయపడ్డాడు !
విషయం ఏమిటంటే చర్లపల్లి జైలులో మద్దెలచెర్వు సూరి అతని అనుచరులు పై విష ప్రయోగం జరిగింది తప్పిన ప్రమాదం అనే వార్త పత్రికల ద్వారా తెలుసుకున్న వంశీ జైల్లో పవన్ కు భోజనం అందించిన తర్వాత కొద్ది సేపటికి మిమ్మల్ని కలవడానికి ఎవరెవరు వచ్చారు? ఈరోజు అని మద్దుల చెరువు సూరి పవన్ ని అడుగగా నా మిత్రుడు తిరుపతి నుంచి వచ్చాడు అని చెప్పగా ఏమైనా చెప్పాడా ?నీకు ఏమైనా ఇచ్చాడా ?అని అడుగగా భోజనం మాత్రం తెచ్చాడు అని చెప్పగా ఆ భోజనం తీసుకురా అని కోరగా ఆ తెచ్చిన భోజనాన్ని జైల్లో ఉన్న ఉన్నతాధికారికి అప్ప చెప్పగా ఆ జైలు అధికారి ఆ ప్యాకెట్ ను బయటకు తీసుకు వచ్చి ఒక వీధి కుక్కకు పెట్టగా, పది నిమిషాల సమయంలో ఆ కుక్క మరణించింది! వార్తా పత్రికల ద్వారా జైల్లో సూరి
సూరి అనుచరులపై విషప్రయోగం వార్త ప్రచురించగా , జైలు అధికారులు ఆ వార్తలను ఖండించారు . నిందితులపై ఎటువంటి విషప్రయోగం జరగలేదని ఆ వార్త నిరాధారమైనవని ఖండించారు ! వంశీ లో ఒకటే ఆందోళన పలుమార్లు ఇంటెలిజెన్స్ అధికారి ని కలవగా నీ మీద ఎటువంటి కేసు నమోదు కాలేదు నీకు ఏమీ కాదు అని చెప్పాడు ! కానీ వంశీ నన్ను దయతో పరిటాల రవి గారి దగ్గరికి తీసుకు వెళ్ళండి అని పలుమార్లు ప్రాదేయపడగా ; ఆ తర్వాతి వారం పరిటాల స్వగ్రామం అనంతపురం జిల్లా వెంకటాపురం గ్రామానికి వంశీని అధికారి తీసుకువెళ్లి బాగ భయపడుతున్నాడు ఇక్కడే ఉంటాను అని అంటున్నాడు అని చెప్పగా నీకు ఏం కాదు అప్ప నీ భయం పోయే వరకు ఇక్కడే ఉండు అని చెప్పగా, చెప్పలేనంత ఆనందం వంశీకి ఆ తర్వాత
వల్లభనేని వంశీ చేసిన ఏ పనికి పరిటాల రవి వంశీ నీ చేయి చేసుకునే చంపేస్తాను నా కొడకా అని ఎందుకు అన్నాడు ?ఎందుకు వంశీని పరిటాల రవి కుక్కను కొట్టినట్టు కొట్టి ఇంటి నుంచి బయటికి బహిష్కరించాడు ?వల్లభనేని వంశీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు కానీ ఆ అమ్మాయికి అప్పటికే పెళ్ళి అయింది. అయినా మనసు మార్చుకోకుండా పెళ్ళైన అమ్మాయి అత్తగారింటికి వెళ్లి ఆ ఇంట్లో వాళ్ళని బెదిరించి తీసుకు వచ్చి బలవంతంగా తాళి కట్టి తన మొదటి భార్య గా చేసుకున్నాడు !
అదే సమయంలో హైదరాబాదుకు చెందిన ఒక ప్రముఖ బిల్టర్ వద్దకు వెళ్లి రివాల్వర్ తో బెదిరించి డబ్బులు వసూలు చేశాడు , ఆ బిల్డర్ పరిటాల రవి వద్దకు వచ్చి జరిగిన విషయం చెప్పగా అప్పటికే వంశీ ఒక ఆడపిల్ల విషయంలో చేసిన దారుణం తెలిసి ఈ రెండు సంఘటనలు ఆధారంగా పట్టరాని కోపంతో ఉన్న రవి , వంశీ ని పిలిపించండి అని ఆదేశించగా; హైదరాబాద్ ఫిలిం నగర్ నందు రవి స్వగృహానికి వల్లభనేని వంశీ వచ్చాడు .ఈ రెండు సంఘటనలు వంశీ ముందు పెట్టి విచారించి పట్టరాని కోపంతో మళ్ళీ నువ్వు బ్రతికి ఉండగా నా కంటికి కనిపించ వద్దు , ప్రాణాలతో వదిలేస్తున్నాను నా కొడకా అని రక్తం వచ్చేటట్టు వివరీతంగాకొట్టి ,రవి ఇంటి నుంచి శాశ్వత బహిష్కరణకు గురయ్యాడు వంశీ! రవి మరణాంతరం వంశీ స్వేచ్ఛగా బయట తిరుగుతూ గన్నవరం క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొంటూ కోడాలి నాని ద్వారా జూనియర్ ఎన్టీఆర్ అభ్యర్థన మేరకు మొదటిసారిగా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది .ఆ తర్వాత విషయాలు మీ అందరికీ తెలిసినవే !
గమనిక : విజయవాడ పోలీసు కమిషనర్ సీతారామాంజనేయులు మంజుభార్గవి అనే ఒక మహిళా డాక్టర్ ను ఉపయోగించి ఆ అధికారిని మీడియాలో అల్లరి చేయించి తన పగ తీర్చుకున్నాడు ! ఆ సమయంలో ఆమె నా కజిన్ అని చెప్పిన వ్యక్తి కొంతకాలానికి ఆమె భర్తతో విడాకులు ఇప్పించి ఆమెని రెండో పెళ్లి చేసుకున్నాడు .