ఏపీలో వకీల్ సాబ్ చిత్రం బెనిఫిట్ షోలకు, టికెట్ ధర పెంపునకు జగన్ సర్కార్ అనుమతివ్వకపోవడం, ఈ వ్యవహారం కోర్టు దాకా వెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీంతో, పవన్ పై జగన్ కక్ష సాధిస్తున్నారని, అందుకే పవన్ సినిమాపై పొలిటికల్ రివేంజ్ తీర్చుకున్నారని అంతా అనుకుంటున్నారు.
అయితే, దీనికి భిన్నంగా…ఈ వ్యవహారంలో జగన్ పాత్ర ఉండకపోవచ్చని, స్థానిక నేతలు ఇళా చేసి ఉంటారని, జగన్ కు తెలిస్తే ఇలా జరగనిచ్చేవారు కాదని జగన్ ను నాగబాబు వెనకేసుకురావడం మరిన్ని విమర్శలకు తావిచ్చింది. పవన్ పిలుపు ప్రకారం బీజేపీకి ఓట్లు పడ్డా…జగన్ కు నష్టం ఏమీ ఉండకపోవచ్చు.
ఈ నేపథ్యంలోనే పవన్ సినిమాను టార్గెట్ చేయడం వల్ల జగన్ కు లాభమేంటి? దీని వెనుక వేరే కారణాలున్నాయా? అసలు పవన్ సినిమాను టార్గెట్ చేసింది వైసీపీనేనా? ఈ ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు రాజకీయవర్గాల్లో జోరుగా చర్చకు వస్తున్నాయి. బీజేపీ పెద్దల అండతోనే ఏపీలో జగన్ ముందుకు పోతున్నాడన్నది బహిరంగ రహస్యమే.
కాబట్టి, కేంద్రంలోని బీజేపీ పెద్దలు తానా అంటే జగన్ తందానా అనాల్సిందే. లేదంటే, సీబీఐ కేసుల విచారణ వేగవంతమై…జగన్ జైలుకు వెళ్లే అవకాశాలున్నాయి. కాబట్టి జగన్ వారిని ఎదురించే రిస్క్ చేయడు. అదలా ఉంచితే…తిరుపతిలో జనసేన అభ్యర్థిని బరిలోకి దింపాలని పవన్ భావించిన సంగతి తెలిసిందే. అయితే, బీజేపీ ఆ సీటును గద్దలా తన్నుకుపోవడం…పై పెచ్చు పవన్ ను ప్రచారానికి ముమ్మరంగా వాడుకోవడం తెలిసిందే.
అంందుకే తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీకి ఓట్లేయకూడదని పవన్ ఫ్యాన్స్, కాపులు, బలిజలు డిసైడ్ అయ్యారు. దీని వల్ల జగన్ కు నష్టం లేదు. కానీ, బీజేపీకి మాత్రం నష్టం. దీంతో, తిరుపతిలో కాపు, బలిజ ఓట్లు క్యాష్ చేసుకునేందుకు పవన్ ను ఆటలోకి తెచ్చారు. వకీల్ సాబ్ ను జగన్ అడ్డుకున్నారన్న ప్రచారాన్ని ముమ్మరంగా చేసిన బీజేపీ నేతలు…ఆ రకంగా కాపు, బలిజ ఓట్లను కొల్లగొట్టాలని స్కెచ్ వేసినట్టు ప్రచారం జరుగుతోంది.
అందుకే, జగన్ తో వకీ్ సాబ్ కీలు విరిపించి….బీజేపీ చోద్యం చూస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వకీల్ సాబ్ ను జగన్ ఆపాడన్న ప్రచారంతో తిరుపతిలో సాలిడ్ ఓటు బ్యాంకున్న కాపులు, బలిజలు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి ఓటేయకూడదని డిసైడ్ అయ్యారు. పవన్ కు కూడా తెలీకుండా జగన్ తో గేమ్ ఆడించింది బీజేపీనే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ ద్వారా పవన్ ను అడ్డుపెట్టుకొని బీజేపీ ఆడిన ఆటలో పవన్ అరటిపండులా మిగిలిపోయారన్న ప్రచారం జరుగుతోంది.