భారతదేశం లో జరిగే ఎన్నికల విషయంలో అమెరికా పాత్ర గురించి.. గత రెండు రోజులుగా చర్చ సాగు తోంది. భారత్ లో ఓటర్ల శాతాన్ని పెంచేందుకు అమెరికా నిధులు ఇస్తున్న విషయం నిన్న మొన్నటి వరకు నర్మగర్భంగా ఉంటే.. ట్రంప్ తీసుకున్న నిర్ణయం తర్వాత.. ఈ విషయం అందరికీ తెలిసింది. అమెరికా ఇస్తున్న 2.1 కోట్ల అమెరికన్ డాలర్లను నిలిపివేస్తూ.. తాజాగా ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. భారత్ కూడా సంపన్న దేశమేనని.. ఆ దేశానికి నిధులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు.
దీనిలో భాగంగా ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు భారత్‌లో రాజకీయ మంటలు రేపుతున్నాయి. ఒక పార్టీని గెలిపించేందుకు.. గత బైడెన్ ప్రభుత్వం ప్రయత్నించిందని ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు.
అయితే.. ఆ పార్టీ ఏంటనేది మాత్రం ఆయన చెప్పకపోయినా.. ప్రధాని మోడీకి-ట్రంప్‌కు మధ్య అవినాభావ సంబంధం ఉంది. అమెరికాలో జరిగిన 2020 ఎన్నికల్లో ట్రంప్‌కు అనుకూలంగా మోడీ ప్రచారం చేశారు. దీనిని బట్టి బైడెన్ భారత్‌లో ఎవరికి మద్దతు ఇచ్చారనే ప్రశ్నకు సమాధానం కాంగ్రెస్ దగ్గరే ఆగుతుంది.
సో.. బైడెన్ భారత్‌లో కాంగ్రెస్ కూటమిని గెలిపించేందుకు ప్రయత్నం చేశారన్న వాదన స్థిరపడుతోంది. ఈ పరిణామాలను మరింత నిశితంగా గమనిస్తే.. గత ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు అమెరికాలోని బైడెన్ ప్రభుత్వం బాంబు పేల్చింది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీపై పెగాసస్ నివేదికలు.. వచ్చాయి. స్టాక్ మార్కెట్లో లేని వ్యాపారాలను సంపదను కూడా సృష్టించి మోసం చేశారన్నది ఆ ఆరోపణ. ఇది పార్లమెంటు ఎన్నికలకు ముందు మోడీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య వివాదం రాజేసింది.
అదేవిధంగా దీనికి ముందు కూడా.. దేశంలో మానహ హక్కుల హననాలు జరుగుతున్నాయని.. దీనిపై తాము స్పందిస్తామని బైడెన్ చెప్పుకొచ్చారు. దీనిని భారత్ ఖండించినా.. కాంగ్రెస్ నాయకులు సమర్థించారు. దేశంలో జరుగుతున్న వాస్తవాలనే బైడెన్ బయట పెట్టారని కాంగ్రెస్ నాయకులు పార్లమెంటులోనే లేవనెత్తారు. ఇవన్నీ.. కూడా కాంగ్రెస్‌కు ఎన్నికల సమయంలో అందివచ్చిన ఆయుధాలే.
అయితే.. ఇవన్నీ పారలేదు.. కాబట్టి.. మోడీ మరోసారి అధికారంలోకి వచ్చారు. కాగా..ఇప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను బట్టి.. బైడెన్ సర్కారు కాంగ్రెస్ కూటమికి పరోక్షంగా సహకరించిందన్న చర్చ తెరమీదికి వచ్చింది. దీనిపై బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మరోసారి రాజకీయ యుద్ధం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.
ఆ దేశం మరెవర్నో గెలిపించేందుకు వారు ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తప్పనిసరిగా తెలియజేయాలి. అదే కీలక ముందడుగు అవుతుంది’’ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ వ్యాఖ్యలు బైడెన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించినవన్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు రానున్న రోజుల్లో దేశీయ రాజకీయాల్ని వేడెక్కించటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.