లాస్ వెగాస్‌లోని కాస్మోపాలిటన్ ఆఫ్ లాస్ వెగాస్ హోటల్లో జరిగిన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ బోర్డ్ సమావేశంలో గౌరవనీయులైన కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా చేతుల మీదుగా శ్రీనివాస మనాప్రగడ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా మానాప్రగడ మీడియాతో మాట్లాడుతూ, తనను ఈ ప్రపంచానికి తీసుకొచ్చిన మా నాన్న జానపద బ్రహ్మ శ్రీ మానాప్రగడ నరసింహ మూర్తి, మా అమ్మ రేణుకాదేవి మానాప్రగడ లకు ముందుగా కృతజ్ఞతలు తెలిపారు.
భార్య కవిత, కుమారులు సింహా, మణిహార్, యువరాజ్, సోదరుడు సాయి “సైచక్” మానాప్రగడ, కోడలు లక్ష్మి, మేనకోడలు శ్రేయశ్రీ & హిమశ్రీ ల ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు.
పెద్దలు డా. పైళ్ల మల్లా రెడ్డి, మార్గదర్శకులు డా. విజయపాల్ రెడ్డి, డాక్టర్ హరనాథ్, డాక్టర్ మోహన్ పట్లోల ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
స్థానిక ప్రముఖులు, నా శ్రేయోభిలాషులు ఆనంద్ కూచిబొట్ల, జయరాం కోమటి, డా. రోమేష్ జాప్రా, రమేష్ తంగెళ్లపల్లి, భరత్ మాదాడి, వెంకట్ ఏక్క, అనిల్ అరబెల్లి, వంశీ రెడ్డి, సరస్వతి, నంద శ్రీరామ, ప్రసాద్, రవినేతి, సోహైల్, అమిత్ నా వెనుక ఉండి నా కార్యకలాపాల్లో నన్నుఎంతో ప్రోత్సహించారు.
కాంగ్రెస్ గౌరవ సభ్యులు రో ఖన్నా మా ఆహ్వానాన్ని మన్నించి ఈ అవార్డును అందించడానికి ప్రత్యేకంగా లాస్ వెగాస్ వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా రో ఖన్నా మానాప్రగడ ను అభినందిస్తూ నిరుపేదలను ఆదుకోవడంలో ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు.