ఒక స్టార్ అయిన ప్రభాస్ 4 కోట్లు విరాళం ఇస్తే అందరూ షాక్ తిన్నారు.
కానీ ఒక ఐటెం గర్ల్ 5 కోట్లు విరాళం ఇచ్చిందని మీకు ఎంతమందికి తెలుసు?
మీకు తెలియదేమో గాని తెలిసిన వారంతా ఆమె ఫ్యాన్స్ అయ్యారు.
సెక్సీగా బట్టలేసుకునే వాళ్లంతా ఎదుటి వారి తమ అందంతో చీట్ చేసి దోచే వారన్న ఖచ్చిత నిశ్చితాభిప్రాయం ఉండేవాళ్లు ఈ దేశంలో కోట్లలో ఉన్నారు.
కానీ ఒక అమ్మాయి డ్రెస్సింగ్ తో వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం శుద్ద తప్పు అని నిరూపించింది.
ఏదో నార్మల్ ఐటెం గర్ల్ అని అందరూ లైట్ తీసుకున్న ఊర్వశి రౌతేలా 2020 మేలో కరోనా వైరస్ నుంచి ఈ దేశం బయటపడేందుకు తన వంతు సాయంగా 5 కోట్లు విరాళం ఇచ్చింది.
ఆయన సాయం చేయడానికి ఎన్నడూ వెనుకడుగు వేయదు.
నెల క్రితం కూడా ఊర్వషి రౌతేలా ఉత్తరాఖండ్లో 27 ఆక్సిజన్ కాన్సట్రేటర్స్ ను విరాళంగా ఇచ్చారు. ఊర్వశి రౌతేలా ఫౌండేషన్ అని తన పేరు మీద ఓ ఫౌండేషన్ పెట్టి ద్వారా సహకారం అందించింది.
ఆమె ఏమన్నదో ఒకసారి విందాం :
“నేను హరిద్వార్ ఉత్తరాఖండ్లో జన్మించాను. దేశ రాజధాని, దేశంలోని ఇతర ప్రాంతాలలో అనేక ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే మనం ఒకరిని ఒకరు ఆదుకోవాలి. మీరు కూడా మీరు చేతనైనంత సాయం చేయండి‘‘
ఇవి ఊర్వశి చెప్పిన మాటలు. నిజమే కదా. ఊర్వశి వంటి వారికి మనం అండగా నిలిస్తే అలాంటి వారు దేశానికి అండగా నిలుస్తారు. తరచూ తన అందాలతో ఫొటో షూట్లు వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో అభిమానులను గిలిగింతలు పెట్టే ఈ అమ్మాయి ఇంత విశాల హృదయం గలది అన్న విషయం సంతోషాన్ని ఇస్తోంది కదా.
ఆమె తాజాగా ఒక యుట్యూబ్ ఛానెల్ పెట్టింది. తనకిష్టమైన గతంలో తాను చేసిన మొదటి పాటనే షూట్ చేసింది. యుట్యూబ్ లో ఆమెను ఎంకరేజ్ చేద్దాం.
దీని ఒరిజినల్ సాంగ్ కూడా కింద చూడొచ్చు