టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఆల్రెడీ ప్రీమియర్ షోలతోనే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా…విడుదలైన ప్రతి చోట బంపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మేనియా మొదలైంది. జక్కన్న చెక్కిన మరో అద్భుత కళాఖండం ఇదని ఫిల్మ్ క్రిటిక్స్, తారక్, చెర్రీ ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. థియేటర్లలో అయితే, ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. థియేటర్లలో ఫ్యాన్స్ కేకలు, కేరింతలు, విజిల్స్ దెబ్బకు సినిమాలో డైలాగులు కూడా సరిగ్గా వినిపించడం లేదంటే…ఆ ఊపు ఎలా ఉందో అర్థమవుతోంది.
ఈ క్రమంలోనే చరణ్ వీరాభిమాని అయిన ఓ సెలబ్రిటీ సినిమాను ప్రీమియర్ షోలో కాకుండా థియేటర్లో ప్రేక్షకుల మధ్య చూశారు. చాలా పాపులర్ అయిన ఆ సెలబ్రిటీ….మామూలుగా అయితే, చాలా కూల్ గా, సైలెంట్ గా కనిపిస్తుంటారు. అటువంటి సెలబ్రిటీ… థియేటర్లో ఫ్యాన్స్ మధ్యలో కూర్చోగానే…వారిలాగే మారిపోయారు. సినిమాలో చరణ్ ఇంట్రడక్షన్ సమయంలో సీట్ లో నుంచి లేచి మరీ గంతులేస్తూ పేపర్లు విసిరేశారు. ఆ సెలబ్రిటీ మరెవరో కాదు….రామ్ చరణ్ సతీమణి ఉపాసన.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాను రాజమౌళి, తారక్, చరణ్ ల ఫ్యామిలీలు థియేటర్లలో చూశారు. అభిమానులతో కలిసి సినిమా చూడడంలో కిక్కే వేరని ప్రమోషన్స్ లో చెబుతోన్న ఈ ముగ్గరూ…అన్నట్లుగానే…థియే
థియేటర్లో సినిమా చూస్తున్న ఉపాసన…చరణ్ ఫ్యాన్స్ తో కలిసి చరణ్ ఫ్యాన్ గా మారిపోయి రచ్చ రచ్చ చేశారు. స్క్రీన్ పై చెర్రీ కనిపిస్తే చాలు… పేపర్లు చించి ఎగరేస్తూ హంగామా చేశారు. సగటు చెర్రీ ఫ్యాన్ గర్ల్ లా మారిన ఉపాసన…అరుస్తూ, కేకలు వేస్తూ పేపర్లు చింపుతూ, వాటిని గాల్లోకి ఎగరేస్తూ రచ్చ చేశారు. తన వెనుక సీట్లో కూర్చున్న చరణ్ పై కూడా పేపర్లు విసురుతూ ఉపాసన చేసిన హంగామా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.