అమెరికాలో వైద్యం రంగానికి తిరుగులేదు.
ప్రపంచ దేశాల్లోనే అమెరికా వైద్య రంగం మంచి పురోగతిలో ఉంది.
ఈ దేశంలో అనేక ఆసుపత్రులు అత్యుత్తమ సేవలు అందిస్తున్నాయి.
వీటిలో పేరొందిన మరో వైద్య శాఖ సెయింట్ జోసెఫ్ మెడికల్ సెంటర్.
ఇది అమెరికాలోని 100 అత్యుత్తమ వైద్య శాలల్లో చోటు సంపాయించుకుంది.
రోగులకు కేవలం వైద్యంతోనే సరిపెట్టకుండా వారికి ఆప్యాయతను, దైర్యాన్ని పంచడంలో ఈ ఆసుపత్రి ముందువరుసలో నిలిచింది.
దీంతో ఈ ఆసుపత్రి తాజాగా గొప్ప గుర్తింపు పొందింది.
అత్యుత్తమ 100 ఆసుపత్రులలో ఒకటిగా ఉన్న స్టాక్టెన్లోని సెయింట్ జోసెఫ్ మెడికల్ సెంటర్`తో తాజాగా యూనివర్శిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్రా(UofSA) `క్లినికల్ ఒప్పందం కుదుర్చుకుంది.
ఇది అత్యంత అరుదైన రికార్డుగానే చెప్పాలి.
ఈ ఒప్పందం ఫలితంగా సమీప భవిష్యత్తులో ప్రపంచ స్థాయి స్కూల్ ఆఫ్ మెడిసిన్ (MD)ని ప్రారంభించాలనే యూనివర్శిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్రా(UofSA) కలను సాకారం చేయనుంది.
ఈ ప్రధాన క్రతువులో ఇది ఒక ఒక ముఖ్యమైన మైలురాయిగా మారనుంది.
ఈ ఒప్పందం పట్ల సెయింట్ జోసెఫ్ మెడికల్ సెంటర్ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.
క్లినికల్ అనుబంధ ఒప్పందంపై సంతకం చేసిందని ప్రకటించడానికి చాలా సంతోషిస్తున్నామని పేర్కొంది.
ఒప్పందం కారణంగా 275 రెసిడెన్సీ స్లాట్లతో వైద్య విద్యార్థులకు అత్యంత మెరుగైన ప్రపంచ స్థాయి స్కూల్ ఆఫ్ మెడిసిన్ అందుబాటులోకి రానుంది.
దేశంలోనే ఇది విలువైన అవకాశాలను అందించే ప్రముఖ వైద్య కేంద్రంగా అవతరించనుంది.
యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర.. ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి కీలకమైన రంగాలను భవిష్యత్తులో మరింత మెరుగైన విధంగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుందని సెయింట్ జోసెఫ్ మెడికల్ సెంటర్ పేర్కొంది.