శతృవుల టార్గెట్ ను కచ్చితంగా ఛేదించగలిగిన సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణి బ్రహ్మోస్ ప్రయోగం సూపర్ సక్సెస్ అయ్యింది. ఆదివారం శాస్త్రవేత్తలు, రక్షణరంగం ఆధ్వర్యంలో జరిగిన ప్రయోగం సక్సెస్ అయినట్లు రక్షణ రంగం ప్రకటించింది. సుమారు 400 కిలోమీటర్ల దూరంలోని శతృదేశాల యుద్ధనౌకల టార్గెట్లను ఈ క్షిపణ కచ్చితంగా ఛేదించగలదు. నూరుశాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ క్షిపణిని అరేబియా సముద్రంలో ప్రయోగించారు. క్షపణి ప్రయోగంలో కచ్చితత్వం, వేగం తదితరాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు, రక్షణరంగం నిపుణులు పూర్తి సాటిస్ఫై అయ్యారట.
రష్యా నిపుణుల సహకారంతో మనదేశ శాస్త్రవేత్తలు బ్రహ్మోస్ క్షిపణిని అత్యంత కచ్చితత్వంతో తయారు చేశారు. వీటిని జలాంతర్గములు, యుద్ధనౌకలు, యుద్ధ విమానాలు, నేలపైనుండి కూడా శతృవులపైకి ప్రయోగించే అవకాశాలుండటమే దీని గొప్పతనం. కొద్ది రోజులుగా మనదేశం అనేక క్షిపణులను వరుసబెట్టి ప్రయోగిస్తోంది. ఒకవైపు పాకిస్ధాన్ మరోవైగా డ్రాగన్ దేశం నుండి ఉద్రిక్తతలు పెరిగిపోతున్న నేపధ్యంలో వీలైనంతగా క్షిపణల సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు మనదేశం తొందరపడుతోంది.
ఇందులో భాగంగానే పోయినెలాఖరులో ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణి భూమిపైనుండి ప్రయోగించేందుకు బాగా పనికొస్తుంది. తూర్పు లడ్డాఖ్ ప్రాంతంలో చైనాతో పెరిగిపోతున్న సమస్యల కారణంగానే మనదేశం ఇప్పటికే లడ్డాఖ్, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లోని వందలాది కిలోమీటర్ల సరిహద్దుల్లో భారీగా క్షిపణులను రెడీ చేసింది. ఇప్పటికే యుద్ధ విమనాలు, యుద్ధ హెలికాప్టర్లు, యుద్ధ ట్యాంకులను కూడా రెడీ చేసిన విషయం తెలిసిందే. ఒకేసారి ఇటు పాకిస్ధాన్, అటు చైనా ఏకకాలంలో దాడులు చేసినా తట్టుకునేట్లుగా తాము తయారుగా ఉన్నట్లు సైనికాధికారులు చేసిన ప్రకటనలు తెలిసిందే.