టీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి హఠాత్తుగా గుండెపోటుతో కొద్ది రోజుల క్రితం మృతి చెందిన సంగతి తెలిసిందే.
మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతోన్న చంద్రమౌళి కార్డియాక్ అరెస్ట్ కు గురై చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో ధర్మారెడ్డి కుటుంబం విషాదంలో కూరుకుపోయింది.
మరి కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన కుమారుడి మరణంతో ఇటు ధర్మారెడ్డి కుటుంబంతోపాటు, వధువు కుటుంబంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ క్రమంలోనే తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న శ్రీనివాస ఆడిటోరియంలో చంద్రమౌళి సంస్మరణ సభను నేడు ఏర్పాటు చేశారు.
బ్రహ్మశ్రీ శ్రీ శ్రీ చాగంటి కోటేశ్వర రావు ప్రవచనం కూడా పెట్టించారు.
రాత్రి సభ ముగిసిన తర్వాత భోజన ఏర్పాట్లు కూడా చేశారు. ఇంతవరకు బాగానే ఉంది.
అయితే, ఈ కార్యక్రమం కోసం ఎస్వీ యూనివర్సిటీలోని హాస్టళ్లలో మాంసాహారం వండుతున్నట్లుగా ప్రచారం జరిగింది.
శనివారంనాడు మాంసాహారం వండడంపై కొందరు విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తోంది.
ఇక, భోజనంతోపాటు సీక్రెట్ గా మద్యం కూడా ఏర్పాటు చేసినట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి.
కాగా, చంద్రమౌళికి చెన్నై పారిశ్రామికవేత్త, టీటీడీ చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ రెడ్డి కుమార్తెతో వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే.