తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు లక్షల కొద్దీ ఉద్యోగాలిస్తామని, ఏడాదికోసారి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని నాటి ప్రతిపక్ష నేత, నేటి అధికార పార్టీ అధినేత, సీఎం జగన్ హామీలు గుప్పించిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే…సీఎం అయిన రెండేళ్ల తర్వాత జాబ్ క్యాలెండర్ అంటూ పదివేల ఉద్యోగాలతో ప్రకటన విడుదల చేయడంపై నిరుద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ మంత్రులు, వైసీపీ నేతల ఇళ్లను ముట్టడించిన నిరుద్యోగులు…తాజాగా మరో అడుగు ముందుకు వేసి తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. ఈ క్రమంలోనే జగన్ కు వ్యతిరేకంగా నిరుద్యోగులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు.
నిరుద్యోగులను దారుణంగా మోసంచేసిన సీఎం జగన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ, విశాఖపట్నం జిల్లా ఎంవీపీ జోన్, కడప జిల్లా జమ్మలమడుగు అర్బన్, రాజంపేట పట్టణ పోలీస్ స్టేషన్లలో జగన్ పై ఫిర్యాదులు చేశారు. టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్ష, ప్రధానకార్యదర్శుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగ విప్లవం తీసుకొస్తామని చెప్పి, నిరుద్యోగ విప్లవాన్ని సృష్టించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు వి
తమను మోసం చేసిన సీఎం జగన్పై సెక్షన్ 420 కింద కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న జగన్ తమను మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జీవో నంబరు 39ని రద్దు చేయాలని, 2,30,000 ఉద్యోగాలకు తక్షణం నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో ఆందోళన కొనసాగించారు.