అయ్యా ఆంధ్రప్రదేశ్ ప్రమాదంలో ఉంది.
మీరు చంద్రబాబును విమర్శించి ప్రజలను డైవర్ట్ చేసినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ బాగుపడదు.
కాస్త రాష్ట్రాన్ని పట్టించుకోండి. సంక్షేమ పథకాలు మంచివే కానీ దానికి ఒక పద్ధతి ఉండాలి అని చెప్పిన వారిని ఎల్లో మీడియా ముద్రేసి తప్పించుకునే ప్రయత్నం చేసింది వైకాపా.
వాళ్లు చెప్పిందే మెజార్టీ ప్రజలు నమ్మారు…
ఇపుడు ఉండవల్లి చెప్పేటప్పటికి అందరికీ చెమటలు పడుతున్నాయి.
దీంతో కమ్మ రాజ్యం అంటూ కొడాలి నానితో డైవర్షన్ మొదలుపెట్టాడు జగన్ రెడ్డి.
కానీ ఉండవల్లి మెసేజ్ చూసి ఏపీ తీవ్రంగా ఆందోళన చెందుతోంది.
ఆయన చెప్పిన స్టేట్ మెంట్ విపరీతంగా వైరల్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి:
➡️కార్పొరేషన్లను తాకట్టు పెట్టి తెచ్చిన అప్పు – ₹1,21,203కోట్లు
➡️వైకాపా ప్రభుత్వం తెచ్చిన అప్పు – ₹71,760కోట్లు
➡️కేంద్ర ప్రభుత్వం దగ్గర చేసిన అప్పు ₹20వేలకోట్లు
➡️ఎఫ్.ఆర్.బి.ఎమ్ పద్దతిలో తెచ్చిన అప్పు ₹3.5లక్షలకోట్లు
➡️తెదేపా నుండి వైకాపా కు వచ్చిన అప్పు ₹90,000కోట్లు
➡️మొత్తం ఏపీ మీద వున్న అప్పు ₹6,00,000కోట్లు, దీనికి వడ్డీ ఏడాదికి ₹42,000కోట్లు
➡️రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్లు తీసుకునే వారికి గత ప్రస్తుత ప్రభుత్వాల బాకీ ₹20,000కోట్లు
➡️చంద్రబాబు గారి ప్రభుత్వం గుత్తేదారులకు పెట్టిన బాకీ ₹25,000కోట్లు
➡️వైకాపా ప్రభుత్వం ఇప్పటివరకు గుత్తేదారులకు బాకీ ఉన్న మొత్తం ₹45,000కోట్లు
అతి దయనీయ పరిస్థితి మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొట్టుమిట్టాడుతుంది.
– ఉండవల్లి అరుణ్ కుమార్