సోమవారం నాడు ఉలవపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
అమృతోత్సవాలలో భాగంగా ఆగస్టు 1 వ తారీకు నుండి 14 వ తారీకు వరకు వివిధ అంశాలలో బాలబాలికలకు వివిధ పోటీలు నిర్వహించడం జరిగింది.
ఈ రోజు పాఠశాలలో జరిగిన వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పాఠశాల తల్లిదండ్రుల కమిటి చైర్ పర్సన్ శ్రీమతి ఉమామహేశ్వరి గారు ముఖ్య అతిథి గా విచ్చేసి జండా ఎగురవేశారు.
తదనంతరము పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ N.ప్రసాద్ గారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమములో వక్తలు స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు.
ఈ కార్యక్రమంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో పాఠశాల స్థాయిలో ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణురాలైన కుమారి షేక్ సమీరా బేగం కు ఈ పాఠశాల పూర్వ విద్యార్థి మరియు NRI అయిన శ్రీ బోగినేని చెంచు రామానాయుడు గారు Rs:10,116/- పదివేల నూటపదహారు రూపాయలు మరియు బంగారు పతకం బహూకరించారు.
వివిధ పోటీలలో విజేతలైన బాలబాలికలకు బహుమతి ప్రదానం జరిగింది. ఈ బహుమతులు మరియు పాఠశాల విద్యార్డులందరుకూమంచి స్వీటు హాటు కూడా శ్రీ బోగినేని చెంచు రామానాయుడుగారు సమకూర్చారు.
వారు తమ మిత్రులు కాలేషావలి గారిని పాఠశాలకు పంపి పై ఏర్పాట్లు చేయించారు.
అంతేకాక కార్యక్రమము ఆద్యంతము వారు అమెరికా నుండి వీడియో కాల్ ద్వారా వీక్షించారు.
ఈ కార్యక్రమానికి పాఠశాల తల్లిదండ్రుల కమిటి చైర్ పర్సన్ శ్రీమతి ఉమామహేశ్వరి గారు మరియు కమిటి సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.