పి ఫైజర్-బయోఎంటెక్ కోవిడ్ -19 వ్యాక్సిన్ను సాధారణ ప్రజానీకం ఉపయోగం కోసం ఆమోదించిన తొలి దేశంగా బ్రిటన్ బుధవారం రికార్డు సృష్టించింది. వచ్చే వారం ప్రారంభం నుంచి ఇది బ్రిటన్ లో సాధారణ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.
ప్రపంచంలో ఇప్పటివరకు దాదాపు 1.5 మిలియన్ల మంది కోవిడ్ తో చనిపోయారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఉధృతం చేసిన ప్రపంచ మహమ్మారిని అంతమొందించడానికి ఒక వ్యాక్సిన్ తప్ప వేరే మార్గం లేదు. ఈ నేపథ్యంలో పి ఫైజర్ ఉత్తమమైన అవకాశంగా భావించబడుతుంది.
“ఫైజర్-బయోఎంటెక్ యొక్క COVID-19 వ్యాక్సిన్ ఉపయోగం కోసం ఆమోదించడానికి బ్రిటన్ కి చెందిన స్వతంత్ర వైద్య ఆరోగ్య సంస్థ (MHRA) ఓకే చేసింది. ఈ టీకా వచ్చే వారం నుండి UK అంతటా అందుబాటులో ఉంటుంది.” అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.అయితే, ముందుగా 80 ఏళ్లకకు పైబడిన వారికి దీనిని ఇవ్వనున్నారు. వీరితో పాటు కేర్ హోమ్ నివాసితులు, ఆరోగ్య, రక్షణ సిబ్బంది దీనిని తొలి విడతలో పొందనున్నారు.