భారతీయులు అన్నీ సులువుగా తీసుకుంటారని… భారతదేశాన్ని చులకనగా అంచనా వేస్తే అది ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ట్విట్టరుకు తెలిసి వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక మాధ్యమ వినియోగదారి ప్రాంతం భారత్. అలాంటి భారత్ భూభాగంలో లడఖ్ ఫ్రాంతాన్ని ట్విట్టర్ చైనా భూభాగంగా చూపింది. దీనిపై భారత ప్రభుత్వం ట్విట్టరుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
దీంతో లడఖ్‌ను చైనాలో భాగంగా చూపించినందుకు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ భారత ప్రభుత్వానికి అధికారిక క్షమాపణలు జారీ చేసింది. వ్యక్తిగత డేటా రక్షణపై పార్లమెంటరీ కమిటీకి ట్విట్టర్ నవంబర్ 30 లోగా తన లోపాన్ని సరిదిద్దుతామని వర్గాలు తెలిపాయి.
ఈ అంశంపై పార్లమెంటరీ ప్యానెల్ చైర్పర్సన్ మీనాక్షి లెఖీ మాట్లాడుతూ చైనాలో లడఖ్‌ను చూపించినందుకు ట్విట్టర్ లిఖితపూర్వకంగా క్షమాపణలు కోరిందని పేర్కొన్నారు. “భారతదేశ పటాన్ని తప్పుగా జియో ట్యాగింగ్ చేసినందుకు ట్విట్టర్ ఇంక్ యొక్క చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ డామియన్ కరియన్ సంతకం చేసిన ట్విట్టర్ యొక్క అఫిడవిట్” అని మీనాక్షి లెఖి దానిని మీడియా ముందు చూపించారు.
“భారతీయ మనోభావాలను దెబ్బతీసినందుకు ట్విట్టర్ క్షమాపణలు చెప్పింది మరియు 2020 నవంబర్ 30 నాటికి లోపాన్ని సరిదిద్దుతామని ప్రమాణం చేసింది” అని ఆమె చెప్పారు.అయినా, ఒక తెలుగు సామెత ఉంది. అడుసు తొక్కనేల కాలు కడగనేల. గూగుల్ మ్యాప్ లో కొడితే లడఖ్ ఎక్కడుందో తెలిసిపోతున్నా ఏ ఉద్దేశంతో ట్విట్టరు ఈ తప్పు చేసిందో, మళ్లీ ఎందుకు భయపడిందో అర్థం కాని అయోమయం.