తెలంగాణ టూరిజం మరియు సాంస్కృతిక శాఖ, జిహెచ్ ఎంసీ వారి సౌజన్యంతో వీవ్ మీడియా సంస్థ ఆధ్వర్యంలో ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది.
హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఈ వేడుకలకు వీవ్ మీడియా సంస్థ వ్యవస్థాపకురాలు కొప్పుల వసుంధర అధ్యక్షత వహించారు.
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ముఖ్య అతిథిగా హజరై వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు ప్రైడ్ ఆఫ్ అవార్డులను బహకరించారు.
హైదరాబాద్ అభివృద్ధికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కృషి చేస్తున్న స్థానికులు, స్థానికేతరులు, ఎన్నారైలను ఈ అవార్డులకు ఎంపిక చేసినట్లు చెప్పారు వసుంధర.
అవార్డులు ఇవ్వడమే కాదు..వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారిని ఒకే వేదిక పైకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
రానున్న రోజుల్లో ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ ను ఒక కమ్యూనిటీ సంస్థగా రూపొందించి యువతకు ముఖ్యంగా దివ్యాంగులకు ప్రొత్సహం ఇస్తామని చెప్పారు వసుంధర.
భారతదేశంలోనే మొదటి దివ్యాంగుల ఇంకుబేషన్ సెంటర్ డీ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా వసుంధర.
హైదరాబాద్ అభివృద్ధికి సహకరించిన, సహకరిస్తున్న వారందరినీ ఒక చోటకు చేర్చి అవార్డులను ఇవ్వడం అభినందనీయమన్నారు ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్.
ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని ఇందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు సజ్జనార్.
ఇలాంటి కార్యక్రమం పెట్టిన వసుంధరను అభినందించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.
వివిధ రంగాలకు చెందిన వారితో పాటు జర్నలిజం విభాగానికి సంబంధించి టీవీ9 రీసెర్చ్ ప్రొడ్యూసర్ కొండవీటి శివనాగరాజును ఘనంగా సత్కరించారు
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్, నటులు మానస్, మిథాలీరాజ్ కుటుంబీకులు, ప్రముఖ డాక్టర్ రమేష్, ప్రముఖ యాంకర్ సునయన, సామాజిక సేవకులు యానాల మురళీ కృష్ణ, 2017 మిస్ యూనివర్స్ అభిమానిక సావి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.