ఏపీ సర్కారు పెద్దలు 151 సీట్లు గెలిచిన మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అనుకుంటూ ఉంటే… ఒక్కొక్క దెబ్బ పడుతుంటే షాక్ తింటున్నారు.
అమరావతితో మొదలైన దెబ్బలు ఉద్యోగుల ధర్నాతో పీక్స్ కు చేరాయి.
ప్రజల ఆవేదనను వీడియో సహితంగా చూపెడుతున్నా కూడా వాటిపై కుల ముద్ర, పార్టీ ముద్ర వేయడానికి ప్రయత్నిస్తూ తప్పించుకోవాలన్న వైసీపీ ఆటలు ఎంతో కాలం సాగలేదు.
జనం కూడా అర్థం చేసుకుంటున్నారు. రోడ్ల విషయంలో కూడా మీడియాను నిందించడంతో జగన్ టీం చెప్పేవన్నీ అబద్దాలే అని… జనాలకు అర్థమైంది.
తాజగా ఉద్యోగుల ఉద్యమాన్ని ప్రసారం చేస్తున్న మీడియాను వైసీపీ తప్పు పట్టే ప్రయత్నం చేసింది. దీంతో అసలు జగన్ ఎన్ని అబద్ధాలు చెప్పాడో బయటపెట్టి… ఆయన పరువు తీసిపడేశాడు టీవీ 5 న్యూస్ ప్రెజెంటర్ సాంబ.