అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టం – ట్రంప్, జోబైడెన్ మధ్య ఫస్ట్ డిబేట్ – రిపబ్లికన్ అభ్యర్థి బైడెన్, ట్రంప్ ముఖాముఖి – ఒకే వేదికపై బైడెన్, ట్రంప్ వాదనలు
అమెరికా : ఆరోగ్య బీమాను రద్దు చేయాలేదు.. ప్రజలకు ఆరోగ్యసేవలను తక్కువ ధరలో అందించే ప్రయత్నం చేశాం – తాము ప్రజలకు కరోనా విషయంలో మెరుగైన వైద్యం అందించాం – ఒబామా కేర్ పాలసీ నిర్వహణ అంతా సులువు కాదు.. పెద్ద ఖర్చుతో కూడుకున్నది – తాను మాస్క్ ధరించట్లేదనే ఆరోపణలను తప్పుబట్టిన ట్యంప్ – అవసరం ఉంటేనే మాస్క్ ధరిస్తాను – జో బిడెన్ తరహాలో తాను ప్రజలకు 200 మీటర్ల దూరంలో ఉండను – డెమొక్రటిక్ పార్టీ 47 ఏళ్ల పాలనలో అగ్రరాజ్యానికి చేసిందేమీ లేదు – భారత్ సహా ఇతర దేశాల్లో కొవిడ్ వల్ల ఎంతమంది మృతిచెందారో బైడెన్‌కు తెలియదా? – గత ఎన్నికల్లో గెలిచాం కనుకే సుప్రీంకోర్టు నియామకాల్లో తమ ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది – అమెరికా ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధిస్తోంది – తాము అన్ని పారదర్శక విధానాలే అవలంబిస్తున్నాం : రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఒబామా కేర్ పాలసీని అధ్యక్షుడు ట్రంప్ నీరుగార్చారు – ట్రంప్ విధానం వల్లే వేలాది మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారు – మహమ్మారి కరోనాను ఎదుర్కొవడంలో ట్రంప్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది – ఒబామా కేర్ పాలసీ రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు – ట్రంప్‌కు ఆరోగ్య రంగంపై అసలు అవగాహన లేదు.. ఎలాంటి ప్రణాళిక లేదు – ప్రజల ప్రాణాలను కాపాడటంలో నామమాత్రంగా నిధులను వ్యయం చేశారు – ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టడానికి ట్రంప్ ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళికలు లేవు : డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్
అక్టోబరు 15న ఫ్లోరిడాలోని మియామిలో, 22న టెన్నెసీలోని నష్విల్లేలో రెండో, మూడో విడత ముఖాముఖి చర్చలు జరుగనున్నాయి.