రెండు రోజులుగా ఏపీ నుంచి వెళ్తున్న అంబులెన్సులను తెలంగాణ సరిహద్దులలో ఆపేయడం, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతుండడం తెలిసిందే.
దీనిపై ఏపీ ముఖ్యమంత్రి తన మిత్రుడు కేసీఆర్‌ను ఏమీ అనకపోయినా తెలంగాణ హైకోర్టు మాత్రం ఇదేం అమానుషం అని ప్రశ్నించింది.
కోవిడ్ లాంటి కష్టకాలంలో ఇలాంటి పనులు ఎలా చేస్తారంటూ తలంటింది.
ఏ అధికారంతో అంబులెన్సులను రానివ్వకుండా అడ్డుకున్నారని ప్రశ్నించింది.
మరోవైపు తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి నియంత్రణకు చేపడుతున్న చర్యలపైనా కోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది.
అంతేకాదు…. తెలంగాణలో కరోనా కట్టడికి చేపడుతున్న చర్యలపైనా సీరియస్ అయింది.
సామూహిక ప్రార్థనలలో కరోనా నిబంధనలు అమలు కావడం లేదని కోర్టు అభిప్రాయపడింది. రంజాన్ తరువాత చర్యలు చేపట్టాలని అనుకుంటున్నారా అని ప్రభుత్వాన్ని డైరెక్టుగా ప్రశ్నించింది.
అయితే.. ఈ రోజు మధ్యాహ్నం కేసీఆర్ తన కేబినెట్‌తో భేటీ అవుతున్నారని.. ఆ సందర్భంగా కీలక నిర్ణయాలు రావొచ్చని ఏజీ చెప్పడం విచారణ మధ్యాహ్నానికి వాయిదా వేసింది.