చంద్రబాబును ఛార్జీలు బాదుతాడు అని ప్రచారం చేసిన జగన్ కి ఆ పీఠం ఎక్కితే గాని నొప్పి తెలియలేదు. అంతేనా… జగన్ సీఎం అయితే గాని… చంద్రబాబుపై జగన్ చేసింది దుష్ప్రచారం మాత్రమే అందులో నిజాలు లేవని అర్థం కాలేదు.
ఎందుకంటే చంద్రబాబు కి వంద రెట్లు, ఆ మాటకు వస్తే దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని పన్నులు జగన్ ఏపీ ప్రజలకు వేస్తున్నారు. చివరకు బాత్ రూంకి సపరేట్ పన్ను వేసిన మొనగాడు జగన్.
ఛాన్సు దొరికితే బాదుడే
పెట్రోలు ఛార్జీల పెంపు
పెట్రోలుపై రోడ్డు ఛార్జీ విధింపు (రోడ్డు వేయకుండానే)
గుడిలో పార్కింగ్ చార్జీ పెంపు
గుడిలో గదుల అద్దె పెంపు
టోల్ ట్యాక్స్ పెంపు
ప్రసాదం ధర పెంపు
మందు ధర పెంపు
ఇసుక ధర పెంపు
బస్సు ఛార్జీల పెంపు
చివరకు ప్రతి ఒక్క ఇంటికి విద్యుత్ ఛార్జీల పెంపు…
ఆ పెంపుపై మళ్లీ ట్రూ అప్ ఛార్జీలంటూ డబుల్ కరెంట్ బిల్
జగన్ బాదుడుతో జనం అల్లాడిపోయారు.
చివరకు తట్టుకోలేక జనం కోర్టుకు ఎక్కడంతో తీర్పు రాకముందే జగన్ వెనక్కు తగ్గాడు.
ఏపీలో విద్యుత్ ట్రూ అప్ చార్జీలు తాత్కాలికంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు.
ఎందుకంటే ఎపుడో ఎవరో తప్పు చేస్తే అది సామాన్యులపై భారం వేస్తే కోర్టులు ఊరుకోవు కదా.
దీంతో జగన్ ఏపీలో విద్యుత్ ట్రూ అప్ చార్జీలను ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేశాడు.
ట్రూ అప్ చార్జీల పెంపుపై ఏపీఈఆర్సీ ఆదేశాలను వెనక్కి తీసుకున్న వైసీపీ సర్కారు ఒక ట్విస్ట్ ఇచ్చింది. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత తుది ఆదేశాలు ఉంటాయని పేర్కొంది.
ట్రూ అప్ చార్జీలు వసూలు చేసుకునేందుకు ఆగస్టు 27న ఈఆర్సీ అనుమతి ఇచ్చింది. యూనిట్‌కు 40 పైసల నుంచి రూపాయి 23 పైసల వరకు ట్రూ అప్ చార్జీలను విద్యుత్ సంస్థలు వసూలు చేస్తున్నాయి. రెండు నెలల నుంచి ట్రూ అప్ చార్జీలు వసూలు చేశాయి. పత్రికా ప్రకటన ఇవ్వకుండా, ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకోకుండా ట్రూ అప్ చార్జీల వసూళ్లపై వినియోగదారులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. హైకోర్టులో పిటిషన్లు, ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ట్రూ అప్ చార్జీలను తాత్కాలికంగా రద్దు చేసింది.
ఇదిలా ఉండగా… దసరా సెలవులు అనంతరం దీనిపై విచారణ చేపడతామని హైకోర్టు పేర్కొంది.