• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఎన్టీఆర్‌కు TRS శ‌త‌జ‌యంతి… ఈ సంచ‌ల‌న వెనుక ఏం జ‌రిగింది?

ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి.. నివాళుల‌ర్పించండి.. వారం కిందటే టీఆర్ ఎస్ నేత‌ల‌కు కేసీఆర్ ఆదేశం?!

admin by admin
May 28, 2022
in Around The World, Politics, Top Stories, Trending
0
0
SHARES
522
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

దివంగ‌త మ‌హానటుడు, ఉమ్మ‌డి ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగు వారి ఆత్మ‌గౌర‌వాన్ని ఢిల్లీ వీధుల వ‌ర‌కు వినిపించిన నాయ‌కుడు.. తెలుగు వారి అన్న‌గారు ఎన్టీఆర్ వందో పుట్టిన రోజు శ‌నివారం. ఈ క్ర‌మంలో అన్న‌గారి శ‌త జ‌యంతిని ఈ రోజు నుంచి నిర్వ‌హిం చాల‌ని.. టీడీపీ నిర్ణ‌యించింది. అదేవిధంగా నంద‌మూరి కుటుంబం కూడా.. ఈ శ‌త జ‌యంతిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది.

వ‌చ్చే ఏడాది మొత్తంగా.. అన్న‌గారి శ‌త జ‌యంతిని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. తెలుగు వారు ఉన్న ప్ర‌తి చోటా.. నిర్వ‌హించ నున్నారు. అయితే.. ఈ విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి జ‌రిగిన‌కార్య‌క్ర‌మాలు అంద‌రినీ సంభ్ర‌మాశ్చ‌ర్యాల్లో ముంచెత్తాయి.

తెలంగాణ‌లోని టీఆర్ ఎస్ పార్టీకి, టీడీపీకి ఎక్క‌డా ప‌డ‌ద‌నే విష‌యం తెలిసిందే. ముఖ్యంగా చంద్ర‌బాబుకు.. కేసీఆర్‌కు రాజ‌కీ యంగా ఎక్క‌డా పొంత‌న‌లేద‌ని.. కూడా తెలిసిందే. ఇలాంటి వైరం కొన‌సాగుతున్న స‌మ‌యంలో అనూహ్యంగా రాష్ట్రంలో ఎన్టీఆర్ వందో పుట్టిన రోజు వేడుక‌ల్లో టీఆర్ ఎస్ మంత్రులు పాల్గొన‌డం.. అత్యంత చ‌ర్చ‌నీయాంశం అయింది.

ఎన్టీఆర్‌ శత జయంతిని పురస్కరించుకుని తొట్ట‌ తొలిసారి.. తెలంగాణ అధికార పార్టీ.. టీఆర్ ఎస్‌కు చెందిన‌ పలువురు రాజకీయ ప్రముఖులు అన్న‌గారి దివ్య స్మృతికి ఘ‌న‌ నివాళులర్పించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్‌తోపాటు ఎంపీ నామ నాగేశ్వరరావు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రపంచ ఖ్యాతి గడించిన ఏకైక తెలుగు బిడ్డ ఎన్టీఆర్ అని మంత్రులు కొనియాడారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చేలా కృషి చేస్తామని ఎంపీ నామ తెలిపారు.

అంతేకాదు.. ఒక తెలుగు బిడ్డగా ప్రపంచ ఖ్యాతి గడించిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన ఆదేశాల మేరకే ఇప్పటికీ ఆయన అభిమా నులు పని చేస్తున్నారు. ఆయన ప్రధాన మంత్రి అవ్వాల్సింది.. జస్ట్‌లో మిస్ అయింది. అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ‘ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చేలా కృషి చేస్తాం. రాజకీయాల్లో, సినిమాల్లో ఆయనకు తారాస్థాయిలో అభిమానులున్నారు. పేదల కష్టం తెలుసుకున్న నాయకుడు ఎన్టీఆర్’ అని ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు.

ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఆయన బాటలోనే కేసీఆర్ నడుస్తున్నారని టీఆర్ ఎస్ మ‌రోనేత‌ మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. మధ్య దళారులు లేకుండా ప్రజలకు అన్ని రకాల సంక్షేమం చేరుకోవాలని ఆకాంక్షించారు. తన వద్ద అర్ధరూపాయి కూడా లేకున్నా.. తనని మంత్రి చేసి.. తనకు పెళ్లి చేసిన గొప్ప మనసున్న వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.

అయితే.. నిజానికి తెలంగాణ ఏర్ప‌డిన ఇన్నేళ్ల‌లో ఏ నాడూ.. అన్న‌గారికి ఒక దండ వేయ‌ని టీఆర్ ఎస్ నాయ‌కులు.. ఒక దండం పెట్ట‌ని టీఆర్ ఎస్ నాయ‌కులు.. ఇప్పుడు హ‌ఠాత్తుగా.. ఎందుకు ముందుకు వ‌చ్చారు?  ఇప్పుడు అనూహ్యంగా అన్నగారికి భార‌త ర‌త్న వ‌చ్చేలా చేస్తామ‌ని ఎందుకు చెప్పారు?  అనేది ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుండ‌గా.. మ‌రో వైపు.. దీనిపై రాజ‌కీయ చ‌ర్చ‌లు కూడా సాగుతున్నాయి.

15 రోజుల కింద‌టే ఆదేశాలు!

ఔను! ప్ర‌స్తుతం టీఆర్ ఎస్‌లో అన్న‌గారు ఎన్టీఆర్ విష‌యంలో వ‌చ్చిన మార్పున‌కు 15 రోజుల కింద‌టే బీజం ప‌డింద‌ని అంటు న్నారు. సీఎం కేసీఆర్ స్వ‌యంగా .. పార్టీనాయ‌కులు.. మంత్రుల‌ను ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి ప్రారంభ వేడుక‌ల్లో పాల్గొనాల‌ని ఆదేశిం చిన‌ట్టు టీఆర్ ఎస్ నేత‌లు గుస‌గుస‌లాడుతున్నారు.

ఆయ‌న ఆదేశాలు లేకుండా.. ఏ ఒక్క‌రూ బ‌య‌ట‌కు వ‌చ్చే ప‌రిస్థితి లేదు.. పైగా.. అన్న‌గారి కార్య‌క్ర‌మాల్లో పాల్గొనే ప‌రిస్థితి కూడా ఉండ‌దు. మ‌రి కేసీఆర్ వ్యూహం ఏంటి? ఎందుకు? అనే చ‌ర్చ సాగుతోంది. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట్ల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా ఈ ప్లాన్ వేశార‌ని అంటు  న్నారు.

ఎందుకంటే.. గ‌తంలో టీడీపీలో ప‌నిచేసిన రేవంత్ రెడ్డి.. ప్ర‌స్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు. ఆయ‌న హ‌వా పెరుగుతోంది. ఈ నేప‌థ్యం లో టీడీపీ అనుకూల వ‌ర్గాలు ముఖ్యంగా ఏపీ నుంచి వ‌చ్చి తెలంగాణ‌లో స్థిర‌ప‌డిన ఏపీ ప్ర‌జ‌లు టీడీపీకి అనుకూలంగా మారి.. వారు.. రేవంత్‌కు పాజిటివ్‌గా మారే ప‌రిస్థితి ఉంటుంద‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో టీడీపీ ఓటు బ్యాంకు ను  త‌న‌వైపు తిప్పుకొనేందుకు.. కేసీఆర్ .. అన్న‌గారి శ‌త జ‌యంతిని వాడుకుంటున్నారనే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ వ్యూహం ఏమేర‌కు వ‌ర్కవుట్ అవుతుందో చూడాలి.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం, ప్రగతి నగర్ లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన విగ్రహాలు ఆవిష్కరించి, పూలమాలలతో ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే @kp_vivekanand . @KTRTRS pic.twitter.com/UFqFfUcn42

— DynamicMLAVivek (@Quthbullapur_) May 28, 2022

https://twitter.com/MJRTRS/status/1530441716905308160

స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి శతజయంతి ఉత్సవాలో భాగంగా ఖుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ కమాన్ దగ్గర ఎన్టీఆర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని, కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసి సభ సమావేశంలో పాల్గొనడం జరిగింది pic.twitter.com/UyNOZOpBYD

— Chamakura Malla Reddy (@chmallareddyMLA) May 28, 2022

Tags: KCRktrntrntr 100 yearsTelanganaTRS
Previous Post

భారతీయ భాషలకు అమెరికాలో ప్రాధాన్యత

Next Post

జనం పోటు: జగన్ గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన పపుపు దళం

Related Posts

Movies

`కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?

June 21, 2025
Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

`సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌

June 20, 2025
Andhra

రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!

June 20, 2025
Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Load More
Next Post

జనం పోటు: జగన్ గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన పపుపు దళం

Please login to join discussion

Latest News

  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra