రండి బాబు రండి..
దండుపాళ్యం దొంగల ముఠాకి స్వాగతం..
ఈడ చూడదగ్గ ప్రదేశాలు,అద్భుత ఆనందాలు ఉన్నాయి.. ఒకసారి చూడండి..
తెలంగాణలో 24 గంటలు AC లో ఉండండి..
మా పోలీసులు మిమ్మల్ని సురక్షితంగా చుస్కుంటరు..
మా హైదరాబాద్ బిర్యాని, మా ఇరానీ చాయి టేస్ట్ చెయ్యండి.. అంతేగానీ
మా అభివృద్ధిని చూసి అమ్మేయ్యాలని మాత్రం ఆశపడకండి..
మా తెలంగాణ మీద మీరాజకీయాలు చేయాలని ఆరాటపడకండి.. ఎందుకంటే
ఇక్కడ ఉన్నదంతా కెసీఆర్ దండు ..తట్టుకోలేరు.. జై తెలంగాణ, జై కెసిఆర్
రెండ్రోజుల జాతీయ సమావేశాలకు భాగ్యనగరికి విచ్చేసిన అమిత్ షా బృందానికి రేపు రానున్న ప్రధాని మోడీ బృందానికీ గట్టిగానే కౌంటర్లు ఇస్తోంది టీఆర్ఎస్. మా అభివృద్ధి మా ప్రాంత ప్రజల కష్టం అని అర్థం వచ్చే విధంగా మాట్లాడుతోంది. దేశానికే అన్నం పెట్టిన లేదా పెడుతున్న రాష్ట్రం తెలంగాణ అని కూడా చెబుతోంది. కానీ పన్నుల వాటలోనూ నిధుల విడుదలలోనూ వివక్ష చూపుతూనే ఉంది అని అంటోంది. కిషన్ రెడ్డి అనే తెలంగాణ ప్రాంతానికి చెందిన నేత కేంద్ర క్యాబినెట్లో ఉన్నప్పటికీ ఫలితం లేకుండా ఉందని వాపోతోంది. ఇదే సందర్భంలో టీఆర్ఎస్ సంధిస్తున్న ప్రశ్నలేంటో చూద్దాం.
– తల్లిని చంపి బిడ్డను బతికించారు అన్న విద్వేష పూరిత వ్యాఖ్యలకు జవాబేంటి?
– తెలంగాణ సమాజం నూకలు అన్న మీ మంత్రి పియూష్ గోయల్ మాటలపై మీ మాటేంటి ?
– అన్ని రాష్ట్రాలకూ వైద్య కళాశాలలను మంజూరు చేసిన మీరు ఇక్కడ మాత్రం ఎందుకు మంజూరు చేయలేదు. కారణం ఏంటి?
ఈ విధంగా ఎన్నో ప్రశ్నలు సంధిస్తోంది టీ సర్కారు. వీటికి సంబంధించి బీజేపీ కూడా కౌంటర్లు బాగానే ఇస్తుంది. దీంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం బాగానే సాగుతోంది. ముఖ్యంగా చాలా చోట్ల నువ్వా నేనా అన్న విధంగా డిజిటల్ వార్ నడుస్తోంది. ఎర్రబెల్లి లాంటి వారు కూడా ట్విటర్ వేదికగా పోస్టులు, రీ పోస్టులు పేరిట బాగానే రాజకీయం నడుపుతున్నారు. మరి ! జనం ముంగిట పాస్ మార్కులు ఎవరికి ? ఫస్ట్ క్లాస్ మార్కులు ఎవరికి ?