షాకింగ్ ఉదంతం ఒకటి తెలంగాణలో చోటు చేసుకుంది. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ మాట ఎంతటి స్ఫూర్తిని రగిల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దసరా వేళ.. భక్తి శ్రద్ధలతో బతుకమ్మను పెట్టి ఆటలాడే తెలంగాణ మహిళా లోకానికి దారుణమైన వేదనను కలిగించే ఉదంతం కాస్త ఆలస్యంగా బయటకొచ్చింది.
మహిళలంతా బతుకమ్మలను తీసుకొచ్చి ఆడుతుండగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అమానుషంగా వ్యవహరించారన్న మండిపాటు వ్యక్తమవుతోంది. మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ ఆడుతున్న వేళ.. వాటిపైకి కారును పోనిచ్చి.. తొక్కుకుంటూ పోయిన దారుణ ఉదంతం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
చల్లా ధర్మారెడ్డి బుధవారం రాత్రి ఆత్మకూరుకు వచ్చారు. అక్కడ సెంట్రల్ లైటింగ్ ను లాంఛనంగా ప్రారంభించారు. అదే సమయంలో పోచమ్మ సెంటర్ వద్ద ఉన్న వేణుగోపాల స్వామి ఆలయం ఎదుట మహిళలు బతుకమ్మలను పెట్టుకొని ఆడుకుంటున్నారు.
ఎమ్మెల్యే వస్తున్నారని.. దారికి అడ్డంగా ఉన్న బతుకమ్మలను తీసేయాలని ధర్మారెడ్డి అనుచరులు డిమాండ్ చేశారు. అయితే.. భక్తిశ్రద్ధలతో ఆడుతున్న బతుకమ్మను మధ్యలో ఆపేది లేదని మహిళలు స్పష్టం చేశారు. దీంతో.. అక్కడే ఉన్న సర్పంచ్ పర్వతగిరి రాజు ఒక పక్క నుంచి ఎమ్మెల్యే కారు పోనిచ్చే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే కారును పోనివ్వాలని కోరినా వినిపించుకోలేదు. దీంతో.. మహిళలను తోసేసి ఎమ్మెల్యే కారును బతుకమ్మల మీదుగా ముందుకు పోనివ్వటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మహిళలు.. గ్రామస్తులు ఎమ్మెల్యే కారును అడ్డుకొని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు నిరసనకు పూనుకున్న వారిని పక్కకు తోసేయటంతో పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. ఈ ఉదంతం తెలంగాణవాదులకు మంట పుట్టేలా చేసింది.
అధికార మదంతో బతుకమ్మలను కార్లతో తొక్కించిన ఎమ్మెల్యేలకు శాపనార్థాలు పెట్టటం షురూ చేశారు. ఈ ఉదంతంపై తాజాగా ధర్మారెడ్డి స్పందించారు. తాను ఆ సమయంలో కారులో లేనని.. నడుచుకుంటూ వెళ్లానని చెబుతున్నారు. తన కారు డ్రైవరర్ పై కొందరు కావాలనే దాడి చేశారని విమర్శించారు.
ఒకవేళ మహిళల మనోభావాలు దెబ్బ తింటే క్షమాపణలు కోరతానని ఆయన ప్రకటించారు. బతుకమ్మలను కారుతో తొక్కించిన వైనానికి ఉత్త సారీ సరిపోతుందా? అన్నది ప్రశ్న.
చల్లా ధర్మారెడ్డి, తాటికొండ రాజయ్య MLA లు తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలి.. వాళ్ళ పై @TelanganaCMO
కెసిఆర్ సార్ చర్య తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రాబోయే రోజుల్లో మహిళలే తగిన బుద్ది చెబుతారు.. pic.twitter.com/zXBzGKirnG— gajula swapna bjp karimnagar (@swapna4knr) October 7, 2021