దళిత బంధు పేరుతో తన గొయ్యి తనే తవ్వకున్న కేసీఆర్… దాని నుంచి బయటపడానికి నానా యాతన పడుతున్నారు.
బంధు.. కేవలం దళితులకే కాదు, అందరికీ అంటూ కొత్తగా ప్రకటన చేశారు. కానీ అది అయ్యే పని కాదని అందరికీ తెలుసు. ఈ దేశ బడ్జెట్ ఒకటి ఇక్కడికి తరలించినా అందరూ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే 2 కోట్ల కుటుంబాలకు ఒక్కొక్కదానికి 10 లక్షలు ఇవ్వాలంటే ఎంతవుతుందో లెక్కేయండి.
సరే ఈ సంగతి పక్కన పెడితే టీఆర్ఎస్ పటాలం మొత్తం ఢిల్లీకి పోతుందట. ఎంపీలు మాత్రమే కాదు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సహా అందరు నేతలు ఢిల్లీకి పోతున్నారు.
వారి ఢిల్లీ పయనానికి కేసీఆరే ప్రత్యేక విమానం నడిపిస్తున్నారు. అయినా వీళ్లందరికీ ఢిల్లీలో ఏం పని అనుకుంటున్నారా? ఏం లేదండీ సెప్టెంబరు 2వ తేదీ ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ శంకుస్థాపన చేస్తున్నారు. తమ బల ప్రదర్శన కోసం ఆ కార్యక్రమానికి కేసీఆర్ అందరినీ తీసుకెళ్తున్నాడు. అదీ సంగతి.