బీజేపీకి వ్యతిరేకంగా అందివచ్చే ఏ అవకాశాన్ని వదులుకోకూడదని కేసీయార్ గట్టిగా డిసైడ్ అయినట్లున్నారు. అందుకనే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక ప్రచారం చేయాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కు కబురు చేశారట. తొందరలోనే కేటీయార్ నేతృత్వంలో తెలంగాణా నుండి పెద్ద బృందమే ఉత్తరప్రదేశ్ కు ప్రచారం నిమ్మితం వెళ్ళబోతోంది.
తెలంగాణాలో చాలామంది పొలిటీషియన్లు హింధి అనర్ఘళంగా మాట్లాడగలరు. కాబట్టి భాషా సమస్యలేని మంత్రులు, ఎంపీలు, ఎంఎల్ఏలు+ఎంఎల్సీలను విడతల వారీగా యూపీ పంపాలని కేసీయార్ డిసైడ్ అయ్యారట. ఇదే విషయాన్ని కేసీయార్ ఎస్పీ అధినేత అఖిలేష్ తో ఇప్పటికే చర్చించారు. తమకు మద్దతుగా టీఆర్ఎస్ నేతలు వచ్చి ప్రచారం చేయటాన్ని అఖిలేష్ కూడా స్వాగతించారని సమాచారం.
ప్రస్తుతం పొత్తులు, సీట్ల సర్దుబాటు, టికెట్లు ఫైనల్ చేసే విషయంలో అఖిలేష్ చాలా బిజీగా ఉన్నారు. ఈ విషయంలో ఓ క్లారిటి వచ్చేస్తే అప్పుడు రోడ్డుషోలు, ర్యాలీలు, బహిరంగసభలపై దృష్టిపెడతారు. అప్పుడు టీఆర్ఎస్ బృందాల ప్రచారం అవసరమవుతుంది. కాబట్టి టీఆర్ఎస్ నేతలు యూపీకి వెళ్ళటానికి మరికొన్ని రోజులు గడువుంది. ఈలోగా యూపీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుండటం తప్ప చేయగలిగేదేమీలేదు.
ఏదేమైనా నరేంద్రమోడికి వ్యతిరేకంగా దేశంలో ఎక్కడ ఏ డెవలప్మెంట్ జరిగినా దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని కేసీయార్ ప్లాన్ చేస్తున్నారు. నిజానికి యూపీకి వెళ్ళి టీఆర్ఎస్ ప్రచారం చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే.
ఎందుకంటే టీఆర్ఎస్ చేసే ప్రచారంతో ఎస్పీ అభ్యర్ధులు గెలిచేది లేదు, బీజేపీ నేతలు ఓడేదీలేదు. అయినా మోడీకి వ్యతిరేకంగా అందతరు చేతులు కలుపుతున్నారనే సంకేతాలను పంపటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. గతంలో కూడా ఝార్ఖండ్ కు వెళ్ళి జేఎంఎంకు మద్దతుగాను, కర్నాటకలో జనతాదళ్ (ఎస్)కు మద్దతుగా టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారు. కాబట్టి ఇపుడు యూపీకెళుతున్నారు.