వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేయడం హాట్ టాపిక్ ఏం కాదు. ఎందుకంటే జగన్ రాసిన జబర్దస్త్ స్క్రిప్ట్ ప్రకారం విజయమ్మ రాజీ ఉన్నా..లేకున్నా…రాజకీయ సమీకరణాల దృష్ట్యా రాజీనామా చేయక తప్పదు. కానీ, రాజీనామా చేసిన తర్వాత విజయమ్మ చేసిన వ్యాఖ్యలు మాత్రం కచ్చితంగా హాట్ టాపిక్కే. కష్టాల్లో ఉన్న కొడుకు జగన్ కు అండగా ఉన్నాను…ఇప్పుడు నా కూతురు కష్టాల్లో ఉంది కాబట్టి..ఆమెతోపాటు ఉండేందుకు వెళుతున్నాను అని విజయమ్మ చెప్పిన మాటలు మాత్రం ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
వేల కోట్ల ఆస్తులున్నా జగన్, షర్మిలలు ఏరకంగా…ఏ రకమైన కష్టాల్లో ఉన్నారంటూ విజయమ్మ కామెంట్లపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. జగన్ అన్నకు లక్ష కోట్లున్నాయని టీడీపీ నేతలు ఆధారాలతో సహా బయటపెట్టారు. ఆ లెక్కన చూస్తే… చెల్లికి కనీసం ఒక పదివేల కోట్లయినా ఉంటాయి. పోనీ, పది వేలు కాదు…వెయ్యికోట్లున్నాయనుకుం
మరి ఏ లెక్కన తన కూతురు కష్టాల్లో ఉందని విజయమ్మ కన్నీరు పెట్టారో అర్థం కాక నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు. విజయమ్మ మాటలను బట్టి ముఖ్యమంత్రి పదవో, మంత్రి పదవో, ఇంకేదో పదవో లేకపోవడమే కష్టమా అని ప్రశ్నిస్తున్నారు. ఇక, రాజన్న రాజ్యం తెచ్చి తెలంగాణ ప్రజల కష్టాలు తీరుస్తానని చెబుతోన్న షర్మిల కష్టాల్లో ఉందని విజయమ్మ చెప్పారు. మరి, తన కష్టాలు తానే తీర్చుకోలేని షర్మిల తెలంగాణ ప్రజల కష్టాలేం తీరుస్తుంది? అంటూ సెటైర్లు వేస్తున్నారు.
విజయమ్మకు ఇద్దరు పిల్లలున్నారు…మనకు రెండు తెలుగు రాష్ట్రాలున్నాయి కాబట్టి సరిపోయింది…అదే ఓ ఐదుగురుంటే దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాలలో ప్రతీ ఐదేళ్లకో రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టించి ఉండేవారేమోనంటూ నెటిజన్లు చురకలంటిస్తున్నారు.