సాధారణంగా ఎన్నికల సమయంలో ప్రజల మధ్య ఏదైనా చర్చ జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత..పార్టీలు, వ్యక్తులు.. నేతల బలంపై ప్రజల్లో జోరైన చర్చకు దారితీస్తుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అయితే.. ఇప్పుడు మారిన కాల మాన పరిస్థితుల కారణంగా.. ఎవరూ ముఖాముఖి చర్చించుకోవడం లేదు. అంతా డిజిటల్ యుగం కావడంతో ఆన్లైనేలో చర్చలు.. సందేశా లు వంటివి సాగుతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ డిజిటల్ విభాగాన్నే బాగా నమ్ముకుంది.
ఈ క్రమంలో జగన్ ప్రసంగాలు, ప్రచారాలు, పాటలు, సందేశాలు.. ఇతరుల అభిప్రాయాలను కూడా పెద్ద ఎత్తున వినిపిస్తోంది. నిజానికి ఒకప్పుడు టీడీపీ ఈ జోరు చూపించేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారి.. అధికారంలో ఉన్న వైసీపీ నాలుగు ఆకులు ఎక్కువ చదివిన చందంగా.. డిజిటల్ ప్రచారాన్ని ఓ రేంజ్లో ముందుకు తీసుకువెళ్తోంది. ఇంత వరకు బాగానే ఉంది. యూట్యూబ్ నుంచి వాట్సాప్ ఛానెల్ వరకు.. అనేక మాధ్యమాల్లో వైసీపీ ప్రచారం చేస్తోంది. ఇది ప్రజలకు కూడా చేరువ అవుతోంది.
కట్ చేస్తే.. ఇక్కడే వైసీపీ బలం ఏంటనేది. ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే.. ప్రజల అభిప్రా యానికి డిజిటల్ రచ్చబండలు వేదికగా మారడంతో వైసీపీ ప్రచారం చేస్తున్న సందేశాలు, కామెంట్లు, పాటలు వింటున్నవారు.. వీటి కింద కామెంట్లు పెడుతున్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత అభిప్రాయం. అంటే .. ఇక్కడ ఎవరూ కూడా.. కంప్యూటర్ ముందు లేదా.. ఫోన్పట్టుకున్నవారిని ప్రలోభాలకు గురి చేసేఅ వకా శం లేదు. పైగా.. ఎవరూ వెనుక ఉండి బలవంతం చేసి కూడా చెప్పించరు.
అందుకే డిజిటల్ మాధ్యమంలో ప్రచారాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ క్రమంలో ఆయా ప్రసారాలు.. ప్రచారాలకు కింద.. నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు. ఈ ప్రభుత్వం తమకు ఏం చేసిందో.. ఏం చేస్తా నని చెప్పి.. ఎలా పాలించిందో.. నిర్మొహమాటంగా జనాలు ఫొటోలు, ఎమోజీలతో సహా పెడుతున్నా రు. ఇవన్నీ.. పార్టీలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమాలే. ఇక్కడ ఎవరు ఎవరినీ బలవంతం చేయరు.
సో.. ఇలా చూసుకుంటే.. డిజిటల్ ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీకి.. నెటిజన్ల నుంచి సూటి పోటి ప్రశ్నలు.. నిలదీతలు.. కారాలు మిరియాలే కనిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయి కూడా.నిపుణులుసైతం దీనినే పేర్కొంటున్నారు.అసలైన ప్రజానాడి ఇదే నంటూ వ్యాఖ్యానిస్తున్నారు. దీనిని బట్టి వైసీపీ పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు. మరి వైసీపీ నాయకులకు ఎలా అర్ధమవుతుందో చూడాలి.