సోషల్ మీడియా జనాలకు ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త టాపిక్ కావాలి. దాని మీద కొన్ని రోజుల పాటు మీమ్స్, ట్రోల్స్‌తో మోత మోగిపోవాలి. ముఖ్యంగా తెలుగు నెటిజన్లకు ఏదైనా కొత్త టాపిక్ దొరికితే ఎలా చెలరేగిపోతారో తెలిసిందే. ఇప్పుడు వాళ్లకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డి దొరికిపోయారు. నిన్నట్నుంచి ఆయన మీద మీమ్స్ మోత మోగిపోతోంది. వైసీపీ అధికారంలో ఉండగా విజయసాయి ఎంత వైభవం చూశారో అందరికీ తెలుసు.
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌ల మీద ఆయన దారుణాతి దారుణమైన వ్యాఖ్యలతో పోస్టులు పెట్టేవారు. తాను ఒక ఎంపీ అని స్థాయి మరిచిపోయి జుగుప్స కలిగించే భాషలో వాళ్లను తిట్టేవారు. ఇప్పుడు విజయసాయి ఓ వివాదంతో వార్తల్లో నిలవడంతో టీడీపీ వాళ్లు రెచ్చిపోతున్నారు. దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేసి ఇటీవలే సస్పెండైన శాంతి అనే మహిళ తల్లి కావడానికి విజయసాయిరెడ్డితో పాటు మరో వ్యక్తి కారణమంటూ ఆమె భర్త ఇటీవల ఉన్నతాధికారులకు చేసిన ఫిర్యాదు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం నిన్నట్నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. విజయసాయి మీద కొన్నేళ్లుగా మండిపోతున్న టీడీపీ మద్దతుదారులకు ఇది పెద్ద ఆయుధంగా మారింది.
దీంతో గతంలో విజయసాయితో శాంతి ఉన్న ఫొటోలన్నీ తెచ్చి డంప్ చేస్తున్నారు. దీంతో పాటు ఒక ప్రభుత్వ అధికారి అయి ఉండి.. రాజకీయ నాయకుడైన విజయసాయి ట్వీట్లకు స్పందిస్తూ శాంతి పెట్టిన కామెంట్లు, పోస్టులన్నింటినీ కూడా బయటికి తీస్తున్నారు. వీళ్లిద్దరి బంధం గురించి.. శాంతి భర్త చేసిన ఆరోపణలను అనుసరించి.. మీమ్స్ తయారు చేసి వైరల్ చేస్తున్నారు. ఇకప్పుడు విజయసాయి చేసిన అతికి ఇది ఫలితం అంటూ ఆయన్ని ఒక రేంజిలో ఆటాడుకుంటున్నారు నెటిజన్లు.