సీఎం జగన్ ఏం చేసినా కరెక్ట్…జగనన్న తీసుకునే ప్రతి నిర్ణయం పేద, మధ్య తరగతి ప్రజల కలలు నెరవేర్చేందుకే అన్నది వైసీపీ నేతల వాదన. ఈ క్రమంలోనే నేడు మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేరుస్తున్నామంటూ ‘జగనన్న స్మార్ట్ టౌన్షిప్లు(ఎంఐజీ)’లకు జగన్ శ్రీకారం చుట్టారు. జగనన్న స్మార్ట్ టౌన్షిల లేఅవుట్లు, వెబ్సైట్ ను లాంచ్ చేశారు. మధ్య తరగతి ప్రజలకు 150, 200, 240 చదరపు గజాల ప్లాట్లు ఎంచుకునేలా బంపర్ ఆఫర్ ఇచ్చారు. అయితే, తొలిదశలో ధర్మవరం, మంగళగిరి, రాయచోటి, కందుకూరు, కావలి, ఏలూరులో మాత్రమే ప్లాట్ల కేటాయింపు ఉంటుంది.
ఇక, సెక్రటేరియట్ కు 10 కిలోమీటర్ల దూరంలో, హైకోర్టుకు 15 కిలోమీటర్ల దూరంలో, మంగళగిరి ఎయిమ్స్, ఎన్నారై, ప్రభుత్వ ఆసుపత్రులకు 5 కిలోమీటర్లలోపు దూరంలో, అమరావతి ఇంటర్నేషనల్ స్టేడియానికి 500 మీటర్ల దూరంలో, నాగార్జునా యూనివర్సిటీకి 9 కిలో మీటర్ల దూరంలో ఈ లేఅవుట్లు ఉన్నాయంటూ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. భలే మంచి చౌకబేరమూ….అంటూ ప్రకటనలు గుప్పిస్తోంది.
అయితే, గతంలో అమరావతి, మంగళగిరి, సీఆర్డీఏ ప్రాంతాలను విమర్శించిన వైసీపీ నేతలు…నేడు అదే ప్రాంతం అద్భుతంగా ఉందంటూ ప్రకటనలిచ్చి ఫ్లాట్లు కొనుక్కోమనడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. అమరావతి అంటే శ్మశానమని, అదొక ఎడారి ప్రాంతమని మంత్రుల కూడా విమర్శించిన నేపథ్యంలో తాజాగా ఫ్లాట్లంటూ బేరం పెట్టడం ఏమిటని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
వైసీపీ పేటీఎం బ్యాచ్ దృష్టిలో ఫ్లాట్లు కొనేందుకు ఉండాల్సిన లొకేషన్ అడ్వాంటేజులు ఇవి కదా అంటూ సెటైర్లు వేస్తున్నారు.
1.గ్రాఫిక్స్
2.శ్మశానం
3.ఎడారి
4.కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు
5.ధనవంతులైన రైతులు
6.జెరీ చీరలు కట్టే ఆడవాళ్ళు
7.రియల్ ఎస్టేట్
8.చంద్రబాబు బినామీలు
9.జడ్జిలకు ఫ్లాట్ లు
10.పెయిడ్ ఆర్టిస్ట్ లు
11.పందులు తిరిగే చోటు
12.విమానాల్లో తిరిగే రైతులు
13.ఎందుకూ పనికిరాని రైతులు
14.ఆడవాళ్ళు తప్ప, మగవాళ్ళు లేని చోటు
15.పేటీఎం ప్రోద్బలంతో పోరాటం చేసే వాళ్ళు