సాధారణంగా.. ఏ వ్యక్తికైనా.. ముందు చూపు ఉంటుంది. ఉండాలి కూడా! రేపు ఏం జరుగుతుందో అనే ఆలోచనే నేటిని ముందుకు నడిపిస్తుంది. ఇదే దేశానికి.. ప్రపంచానికి కూడా ప్రామాణికం. అంతేకానీ.. ముందుకు వెళ్లిపోయిన తర్వాత.. మనసు మార్చుకోవడం.. వెనక్కి రావడం.. ముందుకు వెళ్లడం.. అనేది ఎవరికీ ఉండదు. ఒక చిన్న పాటి వ్యక్తి జీవితానికే ఇన్ని కొలతలు.. లెక్కలు ఉంటే.. రాష్ట్రాలకు నాయకులైన ..పార్టీలను నడిపించేవారైన నాయకుల పరిస్థితి ఏంటి? ఇదీ.. ఇప్పుడు ఏపీ రాజకీయాలపై నెటిజన్లు చేస్తున్న కామెంట్లు. తాజాగా.. ఏపీలో మూడు రాజధానుల విషయాన్ని వైసీపీ ఎంచుకుంది. దీనికి సంబంధించి తాజాగా విశాఖ గర్జన కూడా పూర్తయింది.
ఈ క్రమంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే సీఎం జగన్ మూడు నిర్ణయం తీసుకున్నారని.. పాడిందే పాటగా నాయకులు మరోసారి ప్రబోధిం చారు. అంతేకాదు.. ఒకే చోట అభివృద్ధి జరిగితే.. రాష్ట్రంలోమళ్లీ విభజన వాదం పుంజుకుంటుందని.. అన్నారు. దీనిని అరికట్టేందుకు రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధిని కాంక్షిస్తున్న అభివన అభివృద్ధి ప్రదాతగా.. సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని(కొడాలి నాని కామెంట్స్) నాయకులు చెబుతున్నారు. అంతేకాదు.. చాలా దూరదృష్టితో జగన్ ఆలోచన చేస్తున్నారని కూడా.. వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఆయన వల్లే ఈ రాష్ట్రం అబివృద్ధి చెందుతుందని కూడా అంటున్నారు.
ఓకే.. ఓకే .. సీఎం జగన్ను తప్పు పట్టాల్సిన అవసరం లేదని అనుకుందాం. ఆయనకు అంతా మంచి చేయాలని ఉందనే అనుకుందాం. మరి 2015లో ఈ బుద్ధి ఏమైంది? అనేది ప్రధాన ప్రశ్న. అప్పట్లో రాజధాని అమరావతిపై.. అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు.. జగన్ ఏంచేశారు? అప్పుడు ఆలోచన తట్టలేదా? లేక.. అలసు ఆలోచనే చేయలేదా? అధికారంంలోకి వస్తేనే.. అభివృద్ధి చేయాలనే కాంక్ష… కలిగిందా? అప్పట్లోనే ఆయన తన ఆలోచనను పంచుకుని ఉండొచ్చుకదా! లేక.. మందబుద్ధి ఏమైనా ఉందా? అని.. నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు.
ఈ ఒక్క విషయంలోనేకాదు.. ఉద్యోగులకు సంబంధించిన కంట్రిబ్యూటరీ పింఛన్ స్కీం(సీపీఎస్) రద్దు చేస్తానని.. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చేసి.. తర్వాత.. అదికారంలోకి వచ్చాక.. `తెలియక“ అప్పట్లో హామీ ఇచ్చేశామని.. వెనుకా ముందు ఆలోచించకుండానే.. వ్యాఖ్యానించారు. అంటే.. జగన్కు ఉన్న దూరదృష్టి(విజన్) ఇదేనన్నమాట. ముందు .. అడుసు తొక్కేయడం.. తర్వాత..కాలు కడిగేయడం.. అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇలాంటి నాయకుడి ఏలుబడిలో ఏపీ ఎప్పటికీ అభివృద్ది చెందేను అని పెదవి విరుస్తున్నారు.