ఏపీలో సినిమా టికెట్లపై కొంతకాలంగా నానా రచ్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. టికెట్ల రేట్లు పెంచేదేలే అంటూ జగన్ మొండిపట్టు పట్టడంపై విమర్శలు వస్తున్నాయి.
ఇక, జగన్ కేబినెట్లోని మంత్రులైతే…హీరోల రెమ్యున్ రేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్ వంటి విషయాలలోకి వెళ్లి మరీ నానా యాగీ చేస్తున్నారు.
టికెట్ల రేట్లు తగ్గితే హీరోల పారితోషికం కూడా తగ్గించాల్సి వస్తుందనే వారంతా తెగ బాధపడుతున్నారని మంత్రులు విమర్శిస్తున్నారు.
ప్రతి వస్తువుకు ఎమ్మార్పీ ఉంటుందని, దానికి మించి ఇష్టం వచ్చినట్లు అమ్ముకుంటామంటే కుదరదని అంటున్నారు.
జనం మీద ప్రేమ ఉన్న హీరోలు టికెట్ల రేట్లు ఎందుకు తగ్గించరని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రుల వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. సినిమా టికెట్ల రేట్లు తగ్గించాలని డిమాండ్ చేస్తున్న మంత్రులు…తమ వ్యాపారాల్లో కూడా రేట్లు తగ్గించి అమ్ముతారా అని నెటిజన్లు నిలదీస్తున్నారు.
ఎవడో పడ్డ కష్టానికి జగన్ రేటు ఫిక్స్ చేయడం ఏమిటి అని నెటిజన్లు మండిపడుతున్నారు. జగన్ కు దమ్ముంటే సాక్షి పేపరు రూ.1కి, రూ.400 విలువైన భారతీ సిమెంట్ బస్తా రూ.40కి అమ్మాలని సవాల్ విసురుతున్నారు.
అలా చేస్తే అప్పుడు.నిజంగా జనంపై జగన్ కు ప్రేముందని నమ్ముతామంటూ ట్రోల్ చేస్తున్నారు.
ప్రతి విషయంలో వేలు పెట్టడం వల్ల జగన్ సర్కార్ కు నష్టమేనని విమర్శలు గుప్పిస్తున్నారు.
తెలంగాణలో తాజాగా టికెట్ రేట్లు పెంచిన నేపథ్యంలో టికెట్ రేట్లపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఏం నిర్ణయం తీసుకుంటుందో అన్నదానిపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.