జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు హరి రామ జోగయ్య కొంతకాలంగా లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. అయితే, పవన్ కు సలహాలు ఇస్తున్నా అనే ఫీలింగ్ లో ఉన్న జోగయ్య..పవన్ కు కుల ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం, దాసరి రాము, బొలిశెట్టి సత్యనారాయణ, కేడీఎస్ వంటి వారు కాపు కులం పేరుతో జనసేన, పవన్ లను కాపు కులానికి పరిమితం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
తద్వారా మిగతా కులాలు జనసేనకు దూరం జరిగి వైసీపీకి లాభం జరుగుతుందని వారి ఆలోచన అని టాక్. అందుకే, వాళ్లను జనసేనకు ఎంత దూరం పెడితే అంత అన్ని వర్గాలు పార్టీకి దగ్గర అవుతాయి. పాలకొల్లులో క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీ ఉన్న చిరంజీవి అందరివాడుగా కాకుండా..కొందరివాడిగా చేయడం వల్ల ఆయన ఆనాడు ఓడిపోయారని కొందరు కాపు నేతలు అంటున్నారు. కాపులకు, పవన్ కు ముడిపెట్టి జోగయ్య లేఖలు రాస్తున్నారని, దాని వల్ల చిరు లాగే పవన్ కు ఇబ్బంది అని అంటున్నారు.
పవన్ 3 వేల మంది రైతులను ఎంపిక చేసుకొని 30 కోట్లు సాయం చేశారని, కాపు కుటుంబాలు అందులో చాలా తక్కువ అని గుర్తు చేస్తున్నారు. పవన్ ను మరో చిరంజీవిని చేయొద్దని, వాళ్ల రాజకీయం వారిని చేసుకోనివ్వాలని అంటున్నారు. వైసీపీ, టీడీపీలు బలంగా ఉండడంతో ఏపీలో పొలిటికల్ స్పేస్ లేదని, దానిని క్రియేట్ చేసుకోవడానికి పవన్ చాలా ఓపికతో కష్టపడుతున్నారని చెబుతున్నారు. పవన్ ప్రాక్టికల్ గా ఉన్నారని, కానీ, ఆయనను కులం పేరుతో ఎమోషనల్ గా జోగయ్య డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు.
వయసు వచ్చింది..కానీ, పరిణతి లేదు. ఈ బెదిరింపు ధోరణితో పవన్ ను ఇరుకున పెడుతున్నారు. పవన్ జనసేనను జనసేనలా ఉండనివ్వాలని, కాపుసేనలా కాదని…కాపు అనే ఎమోషన్ ను వాడుకొని పవన్ పై కుల ముద్ర వేయడం ఆయనను బలహీనుడిని చేయడమేనని చెబుతున్నారు.