రాజకీయం ఎలా ఉన్నా కూడా జనసేన వ్యూహం మాత్రం ఈసారి పక్కాగా వర్కౌట్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. అందుకు తగ్గ ప్రణాళికలు కూడా సిద్ధం అవుతున్నాయి.
పవన్ ఈ సారి బీజేపీతో జట్టు కట్టినా టీడీపీతో కలిసి వెళ్లినా ఫలితాలు తనకు అనుకూలంగా మార్చుకోవడమే కాదు క్యాబినెట్ లో కూడా బెర్తులు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 2014లో నష్టపోయిన రీతిన ఈ సారి ఉండకూడదని కూడా భావిస్తున్నారు. అందుకే పవన్ తనదైన పంథాలో టీడీపీకి కొన్ని సూచనలు ఇస్తున్నారు.
వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి తన దగ్గరకు ఎవ్వరూ రావొద్దని చెప్పేశారు. బీజేపీకి కూడా కొన్ని హింట్లు ఇచ్చారు. ఆ హింట్లు ప్రకారం వైసీపీతో బీజేపీ బంధాన్ని బ్రేక్ చేయాలన్నది ఓ యోచన. ఇప్పటికే చాలా మంది బీజేపీ లీడర్లు పవన్ తమతో నడిస్తే పరువు నిలబెట్టుకోవడం ఖాయం అని భావిస్తున్నారు.
డబ్బులున్నా లేకపోయినా పరువు అన్నదే రాజకీయంలో మరీ ముఖ్యమని వీరంతా తలపోస్తున్నారు.ఈ నేపథ్యంలో భీమవరం కేంద్రంగా మరో గాసిప్ రన్ అవుతోంది. ఈ స్థానానికి గతంలో పవన్ పోటీ చేశారు. ఓడిపోయారు. కానీ ఇప్పుడు ఫ్రెండు అయిన త్రివిక్రమ్ ను సీన్లోకి తెస్తారా అన్న గాసిప్ వస్తోంది.
ఇదే స్థానానికి సునీల్ ను కూడా అనుకున్నారు. కానీ అది వర్కౌట్ అయ్యేలా లేదు. తన స్నేహితుడు త్రివిక్రమ్ రంగంలోకి దింపి కానీ లేదా తన ప్రొడ్యూసర్లలో ఎవరో ఒకరిని ఇక్కడ ఉంచి తన పరువు నిలబెట్టుకోవాలని పవన్ భావిస్తున్నారని ఓ టాక్. కానీ ఇవన్నీ అబద్ధాలే అని జనసేన వర్గాలు కొట్టి పారేస్తున్నాయి. ఎప్పటి నుంచో త్రివిక్రమ్ శ్రీనివాస్ కు పవన్ కు మధ్య బంధం ఉందని కానీ అది రాజకీయంగా మారబోదని కూడా తేల్చేస్తున్నారు.