అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ‘ట్రై వ్యాలీ ఎన్టీఆర్ అభిమానులు’ రాజకీయ పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ‘ఎన్టీఆర్’ శత వసంతాల పుట్టినరోజు వేడుకని ప్లసన్ టన్ లోని ‘ఆహా’ రెస్టారెంట్ లో ‘వేణు అట్లూరి’ మరియు ‘అశోక్ కూరపాటి’ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు,
వినాయక శ్లోకం తో మొదలైన కార్యక్రమం, అన్నగారితో అనుబంధం ఉండి పెద్దాయన తో కలిసి పనిచేసిన పెద్దలు జ్యోతి ప్రజ్వలన చేసి ఆయనతో తమకున్న అనుబంధాన్ని, అనుభవాలని పంచుకున్నారు.
ఒక నటుడిగా మొదలయి, తెలుగు జాతి ఇలవేల్పుగా అన్నగారు ఎదిగిన ప్రస్థానంలో తమకు ఎదురైన అనుభూతుల్ని నెమరు వేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో యం వి రావు, సతీష్ వేమూరి, రజనీకాంత్ కాకర్ల, శ్రీధర్ చావా, శ్రీనివాస్ శాఖమూరి, వినయ్ పరుచూరి, శ్రీనివాస్ వేముల, భక్త బల్ల, యశ్వంత్ కుదరవల్లి, శాస్త్రి వెనిగళ్ల, నరహరి మర్నేని తదితరులు హాజరయ్యారు.