కెసిఆర్ మరియు రేవంత్ రెడ్డి మధ్య పోటీ ఎలా ఉంటుందో తెలంగాణ మొత్తం తెలుసు. అయితే రాష్ట్రానికి సీఎంగా ఉండటంతో ఇంతవరకు రేవంత్ రెడ్డిపై ఎప్పుడూ కేసీఆర్‌దే పైచేయిగా ఉంటోంది.
అయితే, ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. రేవంత్ కు చాలా వయసుంది. కానీ కేసీఆర్ కు వయసు మీద పడుతుంది. ఇదే చెబుతుంది భవిష్యత్తు ఏంటో. అధికారం ఏ ఒక్కరికో పరిమితం కాదు, కాలం మారుతుంది. అధికారం మారుతుంది.
కేసీఆర్ తర్వాత రాజకీయ ఆర్థిక సామాజిక అంశాల్లో తెలంగాణలో పట్టున్న వ్యక్తి టి-పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ఇక ఆయన టిఆర్ఎస్ పార్టీ తప్పులతో ఒక పుస్తకమే తయారుచేస్తున్నారు.
కెసిఆర్ ను ఓడించడమే రేవంత్ రెడ్డి అంతిమ లక్ష్యం అని అందరికీ తెలుసు. తాను ఎన్నటికీ టీఆర్ఎస్ పంచన చేరడు అన్న ఈ నమ్మకంతోనే సోనియా అతనికి పీసీసీ పదవి ఇచ్చింది.
ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను సీఎం కుర్చీలోంచి దించడమే నా జీవిత ఆశయం, అది ఏదో ఒక రోజు తప్పకుండా చేస్తాను… అని ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే తాజా ఎపిసోడ్ లో రేవంత్ అన్నారు. ఆ ప్రోమో ఇపుడు వైరల్ అవుతోంది.
ఆదివారం ప్రసారం అయ్యే ఈ షో అతిథి ఈసారి టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఏబీఎన్ రాధాకృష్ణ తెలంగాణ రాజకీయాలకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే సీఎం కావడం గురించి అడిగినప్పుడు, ప్రత్యేక రాష్ట్ర హోదాను ఇచ్చినందుకు సోనియా గాంధీకి తెలంగాణ తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉందని రేవంత్ చెప్పారు.