టాలీవుడ్ హీరోలకు భిన్నంగా ఉండే నటుడు కృష్ణుడు.. వినాయకుడు.. విలేజ్ లో వినాయకుడు మూవీలతో హీరోగా అలరించటం తెలిసిందే. తాజాగా అతగాడు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.
తెలంగాణ రాష్ట్రంలో పేకాటపైన బ్యాన్ ఉందన్నవిషయం తెలిసిందే. తాజాగా మియాపూర్ లోని శిల్పా పార్క్ విల్లాలో ఆయన పలువురితో కలిసి పేకాట ఆడుతూ.. ఎస్వోటీ పోలీసులకు దొరికిపోయారు.
గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన పక్కా సమాచారంతో మియాపూర్ పోలీసులు పకడ్బందీగా దాడులు నిర్వహించారు. టాలీవుడ్ చిత్రాల్లో ఎన్నో పాత్రలు చేసిన కృష్ణుడు.. తాజాగా నిబంధనలకు విరుద్ధంగా పేకాట ఆడుతూ పోలీసులకు దొరికిపోయారు.
ఆయనతోపాటు మరో ఎనిమిది మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. స్టేషన్ బెయిల్ ఇచ్చారా? లేదా? అన్న విషయంపై స్పష్టత రావట్లేదు.
వారి వద్ద నుంచి రూ.1.97లక్షలు.. ఎనిమిది సెల్ ఫోన్లను సీజ్ చేశారు. కృష్ణుడు మిగిలిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజా ఉదంతం కలకలం రేపుతోంది.
పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయిన కృష్ణుడు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తెలిసిన వారే కావాలని అడ్డంగా బుక్ చేయటానికి ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు. అయినా.. నిబంధనలకు విరుద్ధంగా పేకాట లాంటి పాడు పనులు చేయటం ఏమిటి?