తిరుపతి పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఏ క్షణమైనా నిలిచిపోతుందా? ఇక్కడ జరుగుతు న్న దొంగ ఓటర్ల వ్యవహారానికి సంబంధించిన వీడియోలు.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఆన్లైన్లో వెళ్లాయా? అంటే.. ఔననే అంటున్నారు టీడీపీ నాయకులు. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్‌లో ఇతర ప్రాంతాలకు చెందిన దొంగ ఓటర్లను అధికార పక్షం నేతలు.. స్వయంగా కొన్ని బస్సులలో తరలించారని.. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు.
అదేసమయంలో దొంగ ఓటర్లకు సంబంధించిన వీడియోలు కూడా మీడియాలో హల్చల్ అవుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ సీనియర్లు .. కేంద్ర ఎన్నికల సంఘానికి మెయిల్ సహా.. ఇతర మార్గాల్లో ఫిర్యాదు చేశా రు. దీంతో ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విజయానంద్ కూడా సీరియస్‌గా స్పందించారు. ఎవరైనా దొంగ ఓట్లు వేసేందుకు వస్తే.. ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అదేసమయంలో సీసీటీవీల ఫుటేజీని పరిశీలించాలని కూడా స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
నకిలీ ఓటరు కార్డులతో పాటు.. ఇతర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన.. ఓటర్లు పెద్ద ఎత్తున ఓట్లు వేస్తున్నా రు. ఒక్కొక్క బూత్‌లో పది మంది వరకు నకిలీ ఓటర్లు ఉన్నట్టు గుర్తించారు. దీంతో కొందరిని అదిలించి అక్కడ నుంచి పంపేయగా.. చాలా మంది అప్పటికే ఓటు హక్కు వినియోగించుకోవడం గమనార్హం. ఈ పరిణామంతో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఇలాంటి పరిణామాలను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగానే పరిగణిస్తుంది. ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికలో సాయంత్రం వరకు కూడా ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటే.. ఖచ్చితంగా పోలింగ్ ప్రక్రియపై ప్రభావం పడడం ఖాయం అంటున్నారు పరిశీలకులు.