తిరుపతి ఉప ఎన్నికలో గెలవడానికి వైసీపీ సామదానబేధదండోపాయాలను ప్రయోగిస్తోంది. ఏదో ఒక రూటు వర్కవుట్ కాకపోతుందా… ప్రజా వ్యతిరేకతను అధిగమించి గెలవకపోతామా? అన్న ఆశ, గెలవాలన్న కోరిక, గెలవకపోతే కష్టమన్న భయంతో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది.
ఇందులో భాగంగా వైసీపీ తన సోషల్ మీడియా విభాగం ద్వారా టీడీపీ అభ్యర్థిపై ఫేక్ న్యూస్ ప్రచారం చేసింది. పనబాకకు ఇష్టం లేదని, పనబాక పోటీ నుంచి తప్పుకుంటున్నారని వైసీపీ ప్రచారం చేయడం మొదలుపెట్టింది. టీడీపీ కథ అయిపోయిందని జనంలో చిత్రీకరించే ప్రయత్నం చేసింది. సింపుల్ లాజిక్ ప్రకారం ఇది ఫేక్ న్యూస్ అని చెప్పొచ్చు.
ఎలాగంటే ఇపుడు జరుగుతున్నది ఒక ఉప ఎన్నిక. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకి అదొక్కటే ఫోకస్. ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసే అవకాశం, సమయం ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో పనబాక లక్ష్మిని కనుక్కోకుండా అభ్యర్థిని ప్రకటించే అవకాశం లేదు. కానీ పోటీకి ముందే బలహీనం చేసే ప్లాన్ తో జస్ట్ ఒక గాసిప్ వదిలింది వైసీపీ.
దాని గురించి చంద్రబాబు ఏమీ స్పందించకుండా సైలెంటుగా తన పని తాను చేసుకుపోయారు. ఈరోజు ఒక ఫొటోతో సమాధానం చెప్పేశారు. తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక టీడీపీ అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి ఈరోజు చంద్రబాబును కలిశారు. ఉప ఎన్నిక వ్యూహాలపై ఆమె చంద్రబాబుతో చర్చించారు. ఆమెతో పాటు ఆమె భర్త కృష్ణయ్య, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ ఫొటోతో వైసీపీ సృష్టించినది కేవలం గాసిప్ అని అర్థమైపోయింది.