వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. విజయవాడలోని జిల్లా సబ్ జైలుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఆయన పరామర్శించారు. గన్నవరం టీడీపీ కార్యాలయం పై జరిగిన దాడి కేసుపై సత్యవర్ధన్ అనే వ్యక్తి పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే.. ఈ ఫిర్యాదును వెనక్కి తీసుకుని.. కేసులతోతనకు సంబంధం లేదని అఫిడవిట్ ఇచ్చే.. సత్య వర్థన్ను కిడ్నాప్ చేసి బెదిరించా రన్నది మరో కేసు.
ఈ కేసులోనే వంశీని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. 14 రోజుల రిమాండ్ నిమిత్తం స్థానిక కోర్టు ఆ యనను జైలుకు పంపించింది. ఈ నేపథ్యంలోనే జగన్.. వంశీని పరామర్శించేందుకు విజయవాడ జైలు కు వచ్చారు. సుమారు 20 నిమిషాల పాటు వంశీతో భేటీ అయిన అనంతరం.. జగన్ బయటకు వచ్చారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాలి కి కొట్టుకుపోయాయని విమర్శిం చారు. వంశీపై పెట్టిన కేసుల్లో పస లేదన్నారు.
ఉద్దేశపూర్వకంగా రాజకీయ కారణాలతోనే ఈ కేసులు పెట్టి అక్రమంగా జైల్లో పెట్టారని జగన్ ఆరోపించారు. గతంలో తాము ఇలా చేయలేదన్నారు. వైసీపీ నాయకులు దాడి చేసిన సందర్భంలో వైసీపీ నేతలను కూ డా అరెస్టు చేయించామన్నారు. కానీ.. ఇప్పుడు ఏకపక్షంగా చర్యలు ఉంటున్నాయన్నారు. కనకారావు అనే సీఐ కొట్టి మరీ తమ వారిపైనే కేసులు పెట్టాడని జగన్ ఆరోపించారు.
వంశీ అరెస్టు సమయంలో ఎలాంటి నిబంధనలు పాటించలేదని జగన్ అన్నారు. తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టాలన్న ఉద్దేశంతోనే పెట్టారని జగన్ వ్యాఖ్యానించారు. ఈ అరెస్టు.. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చేసినట్టు స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడి కేసులో ఎక్కడా వంశీ పేరు లేదన్న జగన్.. ఘటన జరిగినప్పుడు.. వంశీ అసలు లేరని తెలిపారు. అయినప్పటికీ.. వేరే దారిలో ఓ కార్యకర్తను తీసుకువచ్చి.. ఆయన ద్వారా సాక్ష్యాలు ఇప్పించే తప్పుడు పనిచేస్తున్నారని జగన్ అన్నారు.