ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఇది చేదువార్త. ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మరో న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మీద రాసిన లేఖను చట్ట విరుద్ధంగా బయటపెట్టడంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషను విచారణకు రానుంది. ఈనెల 16వ తేదీన పిటిషను విచారణకు రానుందని న్యాయవాదులు తెలిపారు.
జస్టిస్ లలిత్, జస్టిస్ వినీత్ చరణ్, జస్టిస్ రవీంద్రభట్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది.కొన్ని వారాల క్రితం… జగన్ రెడ్డి ప్రభుత్వం… జస్టిస్ ఎన్వీ రమణ మీద నిరాధార ఆరోపణలు చేసి ఆయన ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా, న్యాయవ్యవస్థకు విరుద్ధంగా వ్యవహరించారని.. కోర్టు దిక్కరణ నేరానికి పాల్పడ్డారని… జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ లు పిటిషను దాఖలు చేశారు.
యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా జగన్ రెడ్డి తప్పును క్షమించకూడదని, ఆయనను శిక్షించాలంటూ కోర్టు పిటిషను వేశారు. వీరితో పాటు సుశీల్ కుమార్ సింగ్ అనే మరో న్యాయవాది మరో పిటిషను వేశారు. వీటన్నింటిని కలిపి 16న విచారణ చేయనున్నారు.
జగన్ తరఫున లేఖ ను విడుదల చేసిన ఆయన సలహాదారు అజేయకల్లం కూడా బుక్ అయిపోయారు. ఇపుడు ఆయన కూడా కోర్టు ధిక్కరణ నేరాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అయితే, 16వ తేదీ తర్వాత గాని ఈ విషయంలో క్లారిటీ రాదు.